కోకాపేట్ లో సరికొత్త ఆకాశహర్మ్యం హాల్ మార్క్ ట్రెజర్ ఆరంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హాల్ మార్క్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సుమారు 4.5 ఎకరాల్లో జి+29 అంతస్తుల ఎత్తులో ఈ అభివృద్ధి చేస్తున్న ఈ నిర్మాణంలో మొత్తం 526 ఫ్లాట్లు వస్తాయి. ఆధునిక సౌకర్యాలు ఏమాత్రం కొదవ లేకుండా తీర్చిదిద్దుతున్న హాల్ మార్క్ ట్రెజర్‌లో 3 మరియు 4 పడక గదుల ఫ్లాట్లను డిజైన్ చేసింది. రెరా అనుమతి లభించిన ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ల సైజు 1765 చదరపు అడుగుల నుంచి 3830 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఎవరికైనా బడా విస్తీర్ణంలో ఇల్లు కావాలన్నా.. డ్యూప్లే ఫ్లాట్లను ఎంచుకునే సౌలభ్యముంది.
ట్రెజర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో వాణిజ్య సముదాయం 0.9 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అంటే, దాదాపు ఏడు శాతం స్థలంలో ఈ సముదాయం ఉంటుందన్నమాట. రూ.2.5 నుంచి రూ.3.5 కోట్లతో విల్లాను కొనాలని భావించేవారిలో చాలామందికి సరైన విల్లాలు దొరకడం లేదు. అలాంటి వారంతా ట్రెజర్ వైపు దృష్టి సారిస్తుండటం విశేషం. ఇక్కడ్నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ ఉండటం విశేషం. ఈ నిర్మాణాన్ని 2024 నవంబర్ లో పూర్తి చేస్తామని సంస్థ సగర్వంగా ప్రకటించింది. 2008లో ప్రారంభమైన హాల్ మార్క్ సంస్థ.. ఇప్పటివరకు దాదాపు 20కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేసింది. ట్రెజర్ ప్రాజెక్టులో ఫ్లాటు కొన్న తర్వాత.. దాదాపు తొమ్మిది యూనిట్లలో నివసించేవారు గండిపేట్ లేక్‌ను ఇరవై నాలుగంటలూ ప్రత్యక్షంగా చూడొచ్చు. ప్రస్తుతం మైనస్ 3 శ్లాబులో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 నవంబరులో ప్రాజెక్టును కొనుగోలుదారులకు అప్పగించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది.
ఇందులోని క్లబ్ హౌజ్ ప్రత్యేకత ఏమిటంటే.. జి+3 అంతస్తుల ఎత్తుల్లో.. పూర్తిగా టవర్లోనే డిజైన్ చేశారు. హాల్ మార్క్ ట్రెజర్ ప్రాజెక్టులో అన్నిరకాల ఆధునిక సౌకర్యాలు ఉండనున్నాయి. జిమ్నాజియం, పవర్ బ్యాకప్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, రిక్రియేషన్ వసతులతోపాటు క్రికెట్ పిచ్, స్క్వాష్ కోర్టు, స్టేకింగ్ రింక్, బాస్కెట్ బాల్ కోర్టు, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే లైబ్రరీతో పాటే ప్రొవిజనల్ స్టోర్స్ కూడా అందుబాటులో ఉండనుంది. 24 గంటల పాటు పూర్తి భద్రత ఉంటుంది.
This website uses cookies.