రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చక్కగా పురోగమిస్తూ అత్యంత డైనమిక్, వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఒకటిగా మారింది. వినియోగదారుల దృక్పథంలో మార్పు వచ్చి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. రిటైల్ రియల్ ఎస్టేట్ లో షాపింగ్ మాల్స్ నుంచి వ్యక్తిగత వ్యాపారాలు, పాప్ అప్ షాపుల వరకు అద్దెకు లేదా లీజుకు ఇవ్వొచ్చు. స్వయంగా నిర్వహించొచ్చు. లేదా విక్రయించవచ్చు. మనదేశంలోని రిటైల్ దుకాణాలు షాపింగ్ మాల్స్, ఫార్మసీ నుంచి డ్రై క్లీనర్స్, కేఫ్ ల వరకు ఏదైనా కలిగి ఉంటాయి. ఈ ఏడాది షాపింగ్ మాల్స్ అద్దెకు ఇవ్వడం గతేడాది కంటే ఎక్కువగా ఉంటుందని సీబీఆర్ఈ అంచనా వేసింది. గతేడాది పోలిస్తే 2022లో కొత్త షాపుల ప్రారంభోత్సవాలు 25 శాతం పెరిగాయి.
అనరాక్ రీసెర్చ్ డేటా ప్రకారం.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021 మొదటి త్రైమాసికంలో 58,290 ఇళ్ల విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది క్యూ1కి వచ్చేసరికి ఏకంగా 71 శాతం పెరిగి 99,550 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఢిల్లీ, ముంబైలు ఏడు నగరాల్లోని మొత్తం అమ్మకాల్లో ఏకంగా 48 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ కామర్స్ బ్రాండ్లు, హౌసింగ్ సంస్థలతో భాగస్వామ్యం చేయడం ద్వారా రిటైలర్లు తమ ఆఫర్లను విస్తృతం చేస్తున్నారు. అలాగే సంప్రదాయ రిటైలర్లు తమ డిజిటల్ వనరులు, వినియోగదారుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా డిజిటల్ వ్యాపారాలు ఎలాంటి అద్దె ఖర్చులు లేకుండా తమ భౌతిక ఉనికిని పరీక్షించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైల్ రియల్ ఎస్టేట్ పరిశ్రమ మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది.
* గత కొన్నేళ్లుగా ఆర్థిక అస్థిరత నేపథ్యంలో రిటైల్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే సమయం ఇదేనా అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి అలాంటి పెట్టుబడి పెట్టడానికి ముందు కొన్ని అంశాలు చూసుకోవాలి. ఆ ప్రదేశంలో అద్దెలు ఎలా ఉన్నాయి? మనం పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం వస్తుందా? వంటివి నిశితంగా పరిశీలించాలి. ప్రస్తుతం ప్రపంచం సాధారణ స్థితికి వచ్చి కార్యకలాపాలన్నీ యథాతథంగా జరుగుతుండటంతో ఏడాది పోడవునా వినియోగదారులు డిమాండ్ కూడా అలాగే పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ నెట్ వర్క్ లను పునర్నిర్మించే పెట్టుబడిదారులు కొత్త అవకాశాలు ఉపయోగించుకోగలుగుతారు. మొత్తమ్మీద రిటైల్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు కాస్త అనిశ్చితిగానే ఉంది. అయితే, రిస్క్ తీసుకునే పెట్టుబడిదారులు మార్కెట్ ను మార్చే సామర్థ్యం కలిగి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
This website uses cookies.