భూముల వేలం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆ మేరకు సన్నద్ధమవుతోంది. హెచ్ఎండీఏ పరిధిలోని మూడు జిల్లాల్లో ఓపెన్ ప్లాట్లతోపాటు ఏడు జిల్లాల్లో భూములను వేలం వేస్తోంది. తద్వారా దాదాపు రూ.2వేల కోట్లు వస్తాయని భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి భూముల వేలం ద్వారా ఆదాయం పొందేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్, ఇతర జిల్లాల్లో భూముల వేలం ద్వారా రూ5వేల కోట్లు ఆర్జించింది. తాజాగా హెచ్ఎండీఏ పరిధిలో 450 ఓపెన్ ప్లాట్లు, ఏడు జిల్లాల్లో 2400 ప్లాట్లను వేలయం వేయనుంది. ఈనెల 14 నుంచి 23 వరకు ఈ వేలంతోపాటు భౌతిక వేలంపాట కూడా నిర్వహించాలని నిర్ణయించింది. బహదూర్ పల్లిలో 87 ప్లాట్లు, తొర్రూరులో 145 ప్లాట్లు, కుర్మాలగూడలో 110 ప్లాట్లు ఉన్నాయి. ఇక ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ, వికారాబాద్ లలో కూడా వేలం వేయనున్నారు.
This website uses cookies.