Categories: LATEST UPDATES

ఆఫీస్ స్పేస్ కు పెరిగిన డిమాండ్

  • నిలకడగా రిటైల్ స్పేస్ డిమాండ్
  • జేఎల్ఎల్ నివేదికలో వెల్లడి

దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఆఫీస్ డిమాండ్ పెరిగిందని జేఎల్ఎల్ తాజా నివేదికలో వెల్లడించింది. షాపింగ్ మాల్స్ లో రిటైల్ స్పేస్ కు డిమాండ్ నిలకడగా ఉందని పేర్కొంది. చాలా నగరాల్లో కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టుల లాంచింగులు కూడా నిలకడగా ఉన్నాయని తెలిపింది. నగరాల వారీగా చూస్తే అహ్మదాబాద్ లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ కొనసాగగా.. రిటైల్ స్పేస్ వినియోగంలోనూ కాస్త పెరుగుదల కనిపించింది. రెసిడెన్షియల్ విభాగంలో అమ్మకాలు, కొత్త ప్రాజెక్టులు నిలకడగా ఉన్నాయి. బెంగళూరులోనూ ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ పెరిగింది.

టాటా రియల్టీ ఇక్కడ 5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కోసం రూ.4వేల కోట్లు వెచ్చించాలని యోచిస్తోంది. ఇక ఇక్కడ రిటైల్, రెసిడెన్సియల్ విభాగాలు నిలకడగా ఉన్నాయి. చెన్నైలో ఆఫీస్ డిమాండ్ గట్టిగానే ఉండగా.. రిటైల్, రెసిడెన్షియల్ విభాగాలు పర్వాలేదనిపించాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ భారీగా ఉండగా.. రిటైల్ స్పేస్ విషయంలోనూ మంచి లావాదేవీలు జరిగాయి. రెసిడెన్షియల్ విభాగం కాస్త పెరిగింది. మన హైదరాబాద్ విషయానికి వస్తే.. ఆఫీస్ స్పేస్ విషయంలో హైటెక్ సిటీ తన మార్కు చూపించింది.

రిటైల్ స్పేస్ డిమాండ్ నిలకడగా ఉండగా.. రెసిడెన్షియల్ విభాగంలో విక్రయాలు, లాంచింగులు ఆరోగ్యకరమైన స్థితిలోనే ఉన్నాయి. రాజపుష్ప సంస్థ నానక్ రామ్ గూడలో ప్రిస్టీనా ప్రాజెక్టు లాంచ్ చేసింది. కోల్ కతాలో ఆఫీస్, రిటైల్, రెసిడెన్షియల్ విభాగాలు బాగానే ఉన్నాయి. ముంబైలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ నిలకడగా ఉండగా.. రిటైల్ స్పేస్ డిమాండ్ పెరిగింది. రెసిడెన్షియల్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. మరోవైపు భారత్ లో డేటా సెంటర్ పరిశ్రమ అద్భుతమైన వృద్ధి సాధించిందని జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో రెట్టింపు అయినట్టు పేర్కొంది. 2019లో 350 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు ఉండగా.. ఇప్పుడు అది 722 మెగావాట్లకు చేరుకుందని వివరించింది.

This website uses cookies.