Categories: LATEST UPDATES

శివారు ప్రాంతాలకు పెరిగిన డిమాండ్

ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ప్లాట్లు ఫ్లాట్లకు డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. కరోనా తర్వాత ఈ పోకడ మరీ ఎక్కువైంది. కరోనా ముందు దీనికి వ్యతిరేక ట్రెండ్ ఉండగా.. కరోనా తర్వాత స్థిరమైన లాక్ డౌన్లు, వర్క్ ఫ్రం హోం విధానం, రిమోట్ వర్కింగ్ వంటి పలు అంశాలు వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ వంటి ద్వితీయ శ్రేణి నగరాల రియల్ అభివృద్ధికి దోహదం చేశాయి. మైసూర్, కొయంబత్తూర్, నాగ్ పూర్, హుబ్లీ, బెల్గాం, పంజిమ్, అహ్మదాబాద్ వంటి ఎన్నో నగరాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులను స్వాగతించాయి.

ఇవి మెట్రో నగరాలకు కాస్త దగ్గరగా ఉన్న అనుభూతిని ఇవ్వడం వల్ల అక్కడి ప్రాపర్టీల ధరలు పెరిగాయి. ఫలితంగా జీవన వ్యయం కూడా పెరిగింది. మరోవైపు భారతీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే కీలకమైన అంశాలు వేగంగా వచ్చాయి. వీటి ముఖ్యమైనది డిజిటల్ హౌస్ వేట. దీనిని ఎన్నారై పెట్టుబడిదారులు, తరచుగా సైట్ సందర్శనలకు వెళ్లలేనివారు బాగా స్వాగతించారు. ఇళ్ల కొనుగోలుదారులకు రియల్ టైమ్ వీడియో స్క్రీనింగ్, త్రీడీ మోడల్ ను చూపించడం ద్వారా చాలా సమయం ఆదా అవుతోంది. ఇది అటు కొనుగోలుదారులకు, ఇటు డెవలపర్లకు సౌకర్యవంతంగా మారింది. ఈ సాంకేతికత సాయంతో ఇక్కడి ఇళ్లను బయ్యర్లు ఎక్కడో కూర్చుని చూస్తున్నారు. దీంతో శివారు ప్రాంతాలకు మళ్లీ డిమాండ్ పెరిగింది.

This website uses cookies.