తొలి త్రైమాసికంలో 23 శాతం పెరుగుదల
ప్రముఖ డెవలపర్ డీఎల్ఎఫ్ లాభాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తమ లాభాలు 22.5 శాతం మేర పెరిగి రూ.646 కోట్లకు చేరినట్టు డీఎల్ఎఫ్ తెలిపింది. తాము అంచనా వేసిన రూ.682 కోట్ల కంటే ఇది కాస్త తక్కువ ని పేర్కొంది. గతేడాది క్యూ1లో తమ లాభాలు రూ.527 కోట్లు అని వెల్లడించింది. గతేడాది తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.1423.23 కోట్లు కాగా, ఈ ఏడాది క్యూ1లో 4 శాతం తగ్గి రూ.1362.35 కోట్లకు పరిమితమైందని వివరించింది. వాస్తవానికి క్యూ1లో 1474 కోట్ల ఆదాయం వస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు.
కాగా, 2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.1729.82 కోట్ల ఆదాయం రాగా, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1521 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే వార్షిక ప్రాతిపదికన 14 శాతం పెరిగింది. అలాగే ఈ త్రైమాసికంలో కంపెనీకి రూ.6,404 కోట్ల విలువైన కొత్త బుకింగులు వచ్చాయి. వార్షిక ప్రాతిపదికన ఇది 214 శాతం అధికం.
This website uses cookies.