Categories: TOP STORIES

హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు

హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు స్వల్పంగ పెరిగాయి. గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాల్లో 5 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ఆరునెలల్లో మొత్తం 15,355 యూనిట్లు అమ్ముడయయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 14,693 యూనిట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు మొదటి ఆరు నెలల్లో ఒక శాతం తగ్గి, 1,56,640 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో అమ్మకాలు 1,58,705 యూనిట్లుగా ఉన్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సం‍స్థ నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది. స్థూలంగా ఇళ్ల ధరలు 2-10 శాతం మధ్య పెరిగినట్టు పేర్కొంది.

నగరాల వారీగా చూస్తే.. ముంబైలో ఇళ్ల అమ్మకాలు 8 శాతం తగ్గి 40,798 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 3 శాతం పెరిగి 30,114 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2 శాతం క్షీణించి 26,247 యూనిట్లకు పరిమితమయ్యాయి. పుణెలో 1 శాతం తగ్గి 21,670 యూనిట్లుగా ఉన్నాయి. చెన్నై రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో ఇళ్ల విక్రయాల్లో 3 శాతం వృద్ధి కనిపించింది. ఇక్కడ 7,150 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. కోల్‌కతాలో ఇళ్ల అమ్మకాలు 3 శాతం పెరిగి 7,324 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్‌ పట్టణంలో ఇళ్ల విక్రయాలు 3 శాతం తగ్గి 7,982 యూనిట్లుగా ఉన్నాయి.

This website uses cookies.