దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ కు మళ్లీ ప్రాధాన్యం పెరుగుతోంది. కరోనా కాలంలో దాదాపు మూతపడిన మాల్స్ రెండేళ్లలోనే మళ్లీ ఆదరణ చూరగొన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది దేశంలో కొత్తగా 11 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి మొత్తం విస్తీర్ణం 59.48 లక్షల చదరపు అడుగులు. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. ఆన్ లైన్ షాపింగ్ వంటివి పెరుగుతున్నా.. ఆఫ్ లైన్ పట్ల కూడా కొనుగోలుదారులు మక్కువ చూపిస్తున్నారు.
కనీసం వారానికోసారైన మాల్ కు వెళ్లాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పెట్టుబడిదారులు మాల్స్ వైపు దృష్టి పెట్టారు. ఫలితంగా దేశంలో కొత్తగా 11 మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. రిటైల్ స్పేస్ పరంగా చూస్తే 72 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది అందుబాటులోకి వచ్చిన మాల్స్ లో హైదరాబాద్ లోనే మూడు ఉండటం విశేషం. పుణె, చెన్నైల్లో రెండేసి చొప్పున, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ లలో ఒక్కో మాల్ వచ్చాయి. ఈ ఏడాది కూడా ఇదే జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.