Categories: LEGAL

ఐఆర్ఈఓ ఎండీ అరెస్టు

ఐఆర్ఈఓ గ్రూప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ గోయెల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన్ను నాలుగురోజులుపాటు ప్రశ్నించిన అధికారులు.. మరింత సమాచారం రాబట్టడం కోసం అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. 2010లో ఈ కంపెనీ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టు వెలువడ్డ ఆరోపణలపై ఈడీ చండీగఢ్ విభాగం దర్యాప్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో గోయల్ గురువారం ఢిల్లీలోని విమానాశ్రయంలో విమానం ఎక్కబోతుండగా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈడీ అధికారులు ఆయన్ను నాలుగురోజులపాటు ప్రశ్నించారు. కానీ ఆయన సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అరెస్టు చేశారు. దాదాపు 77 మిలియన్ డాలర్ల గృహ కొనుగోలుదారుల సొమ్మును విదేశాలకు అక్రమంగా తరలించిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. పండోరా పేపర్స్ లో సైతం గోయెల్ పేరు వెలుగు చూసింది.

This website uses cookies.