Categories: TOP STORIES

కొంటే ఎంత‌? అద్దె ఎంత‌?

హైద‌రాబాద్‌లో విచిత్ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఫ్లాట్ కొనుగోలు ధ‌ర‌తో పోల్చితే అద్దెలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు, కేపీహెచ్‌బీ కాల‌నీలో కొత్త ఫ్లాట్ రూ.80 ల‌క్ష‌లు పెట్టి కొంటే.. నెల అద్దె కేవ‌లం ఇర‌వై వేల‌కు పైగా ఉంటుంది. ఎందుకంటే, అంత‌కంటే త‌క్కువ ధ‌ర‌కు చాలా ఫ్లాట్లు దొరుకుతాయి. చందాన‌గ‌ర్ అయినా ఇదే ప‌రిస్థితి. గ‌చ్చిబౌలిలో అయితే కోటి రూపాయ‌లు పెట్టి ఫ్లాట్ కొంటే.. చేతికొచ్చే అద్దె మ‌హా అయితే ముప్ప‌య్ వేల దాకా ఉంటుంది. అయితే క‌మ్యూనిటీని బ‌ట్టి రేటు మారుతుంది. మ‌రి, ఏయే ప్రాంతాల్లో కొత్త ఫ్లాటు ధ‌ర ఎలా ఉంది? అక్క‌డే రెండు ప‌డ‌క గ‌దుల అద్దెలు ఎలా ఉన్నాయంటే..

 

ప్రాంతం ఫ్లాట్ ధర (చ. అ.కి ) 2 బీహెచ్ కే ఫ్లాట్ అద్దె (రూ.లలో)
కనిష్టం గరిష్టం కనిష్టం గరిష్టం
కేపీహెచ్ బీ ఫస్ట్ ఫేజ్ 5,500 6,000 12,856 17,531
అల్కపురి కాలనీ 4,335 5,100 11,356 14,763
ఆల్విన్ కాలనీ 4,500 5,058 11,356 14,763
అమీర్ పేట 6,500 7,500 10,809 13,756
అత్తాపూర్ 4,500 4,888 8,925 12,543
బేగంపేట 7,000 7,500 12,431 15,300
చందానగర్ 4,500 5,100 9,733 12,388
చెక్ కాలనీ 5,500 6,400
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 6,500 7,000 18,139 22.262
గచ్చిబౌలి 8,000 9,300 17,422 23,256
హఫీజ్ పేట 6000 7,200 11,220 17,340
హయత్ నగర్ 3,500 4,200 4,870 4,870
హైటెక్ సిటీ 7,500 8,500 18,690 23,950
జూబ్లీహిల్స్ 8,600 9,800 14,875 18,062

This website uses cookies.