Categories: TOP STORIES

డిసెంబర్లో కొత్త ఇల్లు కొనడం మంచిదేనా?

2023కి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. ఈ నెలలో కొత్త ఇల్లు కొనడం మంచి నిర్ణయమే అవుతుందా అనేది చాలామందిలో ఉన్న సందేహం. మరి డిసెంబర్లో ఇల్లు కొనడం తెలివైన నిర్ణయమేనా కాదా అనేద చూద్దామా? డిసెంబర్లో ఇల్లు కొనడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ఏడాది చివరినాటికి డెవలపర్లు తమవద్ద మిగిలిన ఇన్వెంటరీని వేగంగా విక్రయించడానికి, తద్వారా ఈ ఏడాది అమ్మకపు గణాంకాలను పెంచుకోవాలనే తపన కలిగి ఉంటారు.

అందువల్ల మంచి ఆఫర్లు, రాయితీల వంటివి ప్రకటించి తమ ఇన్వెంటరీని విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే డిసెంబర్లో ఇల్లు కొనడం వల్ల ఆర్థికంగా కాస్త కలిసి వస్తుందన్నమాట. కొనుగోలుదారులను ఆకర్షించడం కోసం వివిధ పథకాలు, తగ్గింపులు, ఇతరత్రా పోత్సాహకాలు ఇస్తారని, తద్వారా కొనుగోలుదారులకు మిగిలిన సమయం కంటే డిసెంబర్ నెల కలసి వస్తుందని రియల్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇక్కడ కూడా కొన్ని ప్రతికూలతలతు ఉన్నాయి. ఇళ్ల లభ్యత పరిమితంగానే ఉంటుంది. అలాగే డిసెంబర్ అంటే సెలవులు ఎక్కువగా పెట్టే నెల. ఇది కొనుగోలు ప్రక్రియలో కాస్త జాప్యానికి కారణం కావొచ్చు. అయితే, మీరు ముందుగానే ఓ ప్రాజెక్టులో ఇల్లు కొనాలని నిర్ణయించుకుని ఉంటే మాత్రం డిసెంబర్ సరైన సమయమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

This website uses cookies.