తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందో లేదో.. ఎన్ఎస్ఎల్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ.. ఈస్ట్ హైదరాబాద్‌లో టాలెస్ట్ టవర్స్ అయిన ఈస్ట్ లగ్జోరియా అనే హైఎండ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈస్ట్‌లో ఇల్లంటే.. ఉత్తమమైన దానికంటే మెరుగైనదంటూ ఈ సంస్థ చెబుతోంది.
ఎన్ఎస్ఎల్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ.. ఉప్పల్ క్రికెట్ స్టేడియం పక్కనే.. 44 అంతస్తుల ఎత్తులో నాలుగు టవర్లను నిర్మిస్తోంది. అంటే, ఈ ప్రాజెక్టులో నివసించేవారు బాల్కనీలో కూర్చుంటే క్రికెట్ మ్యాచ్ కనిపించే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఒక అంతస్తులో కేవలం ఆరు ఫ్లాట్లను మాత్రమే డిజైన్ చేశారు. పైగా, ఎనభై వేల చదరపు అడుగుల్లో రెండు క్లబ్ హౌజుల్ని డెవలప్ చేస్తారు. ఇందులో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. క్లబ్ హౌజ్‌ను చూస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుందని సంస్థ చెబుతోంది. రెండు ఇండోర్ స్విమ్మింగ్ పూళ్లు, ల్యాండ్ స్కేపింగ్ గల వ్యూయింగ్ డెక్స్, లగ్జూరీయస్ గ్రీన్ స్పేసెస్, ప్రపంచ స్థాయి ఇండోర్ మరియు ఔట్‌డోర్ క్రీడా సౌకర్యాల్ని ఇందులో పొందుపరుస్తామని సంస్థ చెబుతోంది.
This website uses cookies.