హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థలపై గురు, శుక్రవారాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని సమాచారం. నగరంలో దాదాపు పద్నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాల్ని జరిపారని తెలిసింది. రికార్డులు సరిగ్గా నిర్వహించకపోవడం, ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించడం వంటి అంశాల కారణంగా వేకువజామున ఐదు నుంచి ఐటీ దాడులు జరిగాయి. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు.. మాగంటి గోపినాథ్ తో సంబంధమున్న సంస్థలపై ఏకకాలంలో సోదాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. కృష్టప్రసాద్, దాట్ల రవి, నాగ రాజేశ్వరి, పూజా లక్ష్మీ తదితరులపై కూకట్పల్లి, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి.