జపాన్‌కు చెందిన రెండు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేశారు. లాజిస్టిక్స్‌లో ఆటోమేషన్ సంస్థ అయిన డైఫుకూ తెలంగాణ రాష్ట్రంలో రూ.450 కోట్ల పెట్టుబడులు పెడుతోందని.. దీని ద్వారా సుమారు 800 మందికి పైగా ఉపాధి లభిస్తుందని ట్వీట్ చేశారు.
నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ అనే సంస్థ మూడో ఉత్పత్తి కేంద్రాన్ని సుమారు రూ.126 కోట్లతో తెలంగాణలో పెడుతోందని మంత్రి తెలిపారు. క్లీన్ రూమ్స్ ఉత్పత్తి, హెచ్‌వీఏసీ సిస్టమ్స్ ను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. మరి, ఇవి తెలంగాణలోని ఏ జిల్లాలో పెడుతున్నాయి? ఎప్పుడు పెడుతున్నాయో వివరాలు తెలియాల్సి ఉంది.
This website uses cookies.