మీరు స్థానిక సంస్థల నుంచి ముందస్తు అనుమతి లేకుండా.. నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూనే.. సొంతంగా ఇల్లు కట్టుకున్నారా? లేదా అపార్టుమెంట్‌ను నిర్మించారా? అయితే, మీ ఇంటికి అనుమతి లేదని దిగులు చెందనక్కర్లేదు. ముందస్తు అనుమతి తీసుకోకుండానే నిబంధనలకు అనుగుణంగా కట్టిన నిర్మాణాలకు అనుమతిని మంజూరు చేస్తారు. ఇందుకోసం సాధారణ ఛార్జీల కంటే 33 శాతం అధిక రుసుమును చెల్లించాల్సి వచ్చేది. తాజాగా, ఈ 33 శాతం సొమ్మును టీడీఆర్ రూపంలో సర్దుబాటు చేయడానికి అనుమతినిస్తారు. ఉదాహరణకు ఒక భవనం నిర్మించేందుకు అనుమతి కోసం స్థానిక సంస్థల వద్దకు వెళితే.. మొత్తం ఫీజు రూ.20 లక్షలు అవుతుందని అనుకుందాం.. అందులో 33 శాతమంటే, సుమారు రూ.6.6 లక్షల విలువ గల టీడీఆర్‌ను కొనుగోలు చేస్తే చాలు.. మీ ఇంటికి అనుమతినిస్తారు. అనుమతి లేకపోయినా.. నిబంధనల మేరకు నిర్మించిన ఇల్లు మాత్రమే సక్రమం అవుతుంది. కాకపోతే, ఫైర్ ఎన్వోసీ వంటి ఇతరత్రా నిబంధనల్ని తప్పకుండా పాటించాలన్నది నిబంధన.
This website uses cookies.