బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. తన సినిమాలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న జాన్ కు ముంబైలో అదిరిపోయే, ఔరా అనిపించే అద్భుతమైన, విలాసవంతమైన పెంట్ హౌస్ ఉంది. సముద్రం వైపు ఫేసింగ్ కలిగిన ఈ పెంట్ హౌస్ లో ప్రతిదీ విభిన్నంగా ఉంటుంది. ఎక్కువగా కలపతో చేసిన ఫర్నిచర్ కనిపిస్తుంది.
బాంద్రా వెస్ట్ లో ‘విల్లా ఇన్ ద స్కై‘ పేరుతో ఉన్న ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోని 7, 8 అంతస్తుల్లోని రెండు ఫ్లాట్లను జాన్.. తన అభిరుచికి అనుగుణంగా డూప్లెక్స్ గా తీర్చిదిద్దుకున్నారు. అబ్రహాం జాన్ అనే డిజైన్ సంస్థ.. దీని రూపురేఖలు పూర్తిగా మార్చేసి.. కళ్లు చెదిరిపోయే రీతిలో తయారు చేసింది. రెండు ఫ్లాట్లను కలిపి.. కలపతో రూపొందించిన మెట్లతో అనుసంధానం చేశారు.
ఇక లివింగ్ రూంలో ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు ఏర్పాటు చేసిన విండో నుంచి అరేబియా సముద్రాన్ని కనులారా వీక్షించొచ్చు. పెంట్ హౌస్ చూస్తే చాలా విలాసంతమంగా తీర్చిదిద్దారు. అక్కడ గార్డెన్ టెర్రస్ తోపాటు విశాలమైన వుడెన్ డెక్ ఏర్పాటు చేశారు. లివింగ్ రూమ్ లో గ్లాస్ సెంటర్ టేబుల్ తోపాటు సౌకర్యవంతమైన సిట్టింగ్ ఉంది.
This website uses cookies.