Categories: Celebrity Homes

రెండు ఫ్లాట్లు కొన్న కాజోల్

నటి కాజోల్ రెండు ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ముంబై జుహూలోని అనన్య అపార్ట్ మెంట్ 10వ అంతస్తులో వీటిని కొనుగోలు చేశారు. రెండింటి విలువ రూ.11.95 కోట్లు అని సమాచారం. గతనెలలోనే ఈ లావాదేవీ పూర్తయింది. రెండు ఫ్లాట్ల కార్పెట్ ఏరియా 2వేల చదరపు అడగులు. అంతేకాకుండా ఆమె ప్రస్తుత బంగ్లా ఉన్న పరిసరాల్లో ఈ అపార్ట్ మెంట్ కూడా ఉంది.

త్రిక్ష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో జరిగిన లావాదేవీల్లో కాజోల్ సంతకం చేశారు. కాగా, కాజోల్ తాజా సినిమా త్రిభంగ: తేథి మేథి క్రేజీ సినిమా గతేడాది జనవరిలో ఓటీటీలో విడులైంది.

This website uses cookies.