Categories: LATEST UPDATES

ఏడాదిన్న‌రగా తగ్గిన అమ్మ‌కాలు?

    • హైదరాబాద్లో విచిత్ర పరిస్థితి
    • నైట్ ఫ్రాంక్ తాజా అధ్యయనం

నైట్ ఫ్రాంక్ హైద‌రాబాద్ రియాల్టీ మార్కెట్ గురించి చేసిన తాజా స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. ముఖ్యంగా, అమ్మ‌డు కాని ఫ్లాట్ల గురించి ఈ స‌ర్వేలో దృష్టి పెట్టిన‌ట్లు అనిపించింది. ప‌శ్చిమ హైద‌రాబాద్‌లో గ‌త 7.2 త్రైమాసికాల నుంచి.. అంటే ఏడాదిన్న‌ర‌కు పైగా నుంచి అమ్మ‌డుకాని ఫ్లాట్లు దాదాపు 7,373 ఉన్నాయి. వీటిని పూర్తిగా అమ్మ‌డానికి ఎంత‌లేద‌న్నా మ‌రో ఏడాదిలోపు ప‌డుతుంద‌ని వెల్ల‌డించింది.

ఇక ద‌క్షిణ హైద‌రాబాద్ విష‌యానికొస్తే.. గ‌త నాలుగేళ్లకు పైగా అమ్ముడుకాని ఫ్లాట్లు ఎంత‌లేద‌న్నా 968 ఉన్నాయి. వీటిని అమ్మేందుకు మ‌రెంత లేద‌న్నా ఏడాదికి పైగా ప‌డుతోంద‌ని అంచ‌నా. ఉత్త‌ర హైద‌రాబాద్‌లో గ‌త మూడేళ్ల నుంచి అమ్ముడ‌వ్వ‌ని ఫ్లాట్లు ఎంత‌లేద‌న్నా రెండు వేల‌కు పైగా ఉంటాయి. వీటిని అమ్మేందుకు ఏడాదిలోపు ప‌డుతుంది. తూర్పు హైద‌రాబాద్‌లో మూడేళ్ల నుంచి 951 ఫ్లాట్లు అమ్ముడు కాలేదు. ఇందుకోసం ఎంత‌లేద‌న్నా మరో ఆరు నుంచి ఎనిమిది నెల‌లు ప‌ట్టే అవ‌కాశ‌ముంది. సెంట్ర‌ల్ హైదరాబాద్‌లో ఏడాదిన్న‌ర‌కు పైగా మిగిలినవి 612 ఫ్లాట్లు కాగా. వీటిని విక్ర‌యించేందుకు మ‌రో 8 నెల‌లైనా అవుతుంది. మ‌రి, న‌గ‌రంలో ఫ్లాట్లు కొనేముందు ప్ర‌తి అంశాన్ని తెలుసుకున్నాకే అడుగు ముందుకేయండి.

ఫ్లాట్ల ధరలిలా..

బంజారాహిల్స్ 10200-10600
జూబ్లీహిల్స్ 10990-11090
ఎల్బీనగర్ 4100- 4460
నాచారం 4800- 7600
కొంపల్లి 3312- 3325
సైనిక్ పురి 2700- 2787
రాజేంద్రనగర్ 4830- 4978
బండ్లగూడ 3978- 4234
కోకాపేట్ 4847- 5189
మణికొండ 4390- 4484

(ధర.. చదరపు అడుక్కీ.. రూ.లలో)

గత ఆరు నెలల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట్లో రెండు శాతం రేట్లు పెరిగాయి. ఎల్బీ నగర్, మణికొండలో 3 శాతం.. నాచారం, సైనిక్ పురి, రాజేంద్రనగర్, బండ్లగూడలో 4 శాతం అధికమయ్యాయి. కొంపల్లిలో ఐదు శాతం రేటు పెరిగింది.

This website uses cookies.