దేశీయ నిర్మాణ రంగంలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరముందని నరెడ్కో నేషనల్ అధ్యక్షుడు జి.హరిబాబు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జి హరిబాబు మాట్లాడుతూ.. ఎఫ్ఎఎస్ఐ పరిమితంగా ఉండాలని సూచించారు. బిల్డింగ్ పర్మిషన్ సమయంలోనే నాలా ఛార్జీలను హెచ్ఎండీఏలో కట్టించుకోవాలని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి కోరారు. నాణ్యమైన నిర్మాణాలు కట్టాలని.. అక్రమ నిర్మాణాల్ని నిరోధించాలి ప్రధాన కార్యదర్శి మేకా విజయ్ సాయి తెలిపారు. ఈ సందర్భంగా నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో చిన్న, మధ్యస్థాయి బిల్డర్లు ఎదుర్కొనే వాస్తవిక సమస్యలకు ప్రభుత్వమే పరిష్కారం చూపెట్టాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నరెడ్కో జాతీయ ఉపాధ్యక్షులు పీఎస్ రెడ్డి, ముప్పా వెంకయ్య చౌదరి, నరెడ్కో తెలంగాణ కోశాధికారి కాళీ ప్రసాద్, ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నరెడ్కో వెస్ట్ జోన్ ఛైర్మన్ చెన్నారెడ్డి, జనరల్ సెక్రటరీ వి.ప్రసాద్ రావు, ట్రెజరర్ సురేష్ బాబు, సలహాదారులు సత్యం శ్రీరంగం తదితర బిల్డర్లు పాల్గొన్నారు.
This website uses cookies.