poulomi avante poulomi avante

బొమ్మరిల్లు భాస్కర్ ఇల్లు బాగుంటుంది

  • రియల్ ఎస్టేట్ గురుతో
    సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్

కేవీ గుహన్.. క్రేజీ సినిమాటోగ్రాఫర్. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆయన.. ఎత్తైన భవనాలు, పార్కులు, షాపింగ్ మాల్స్ తో నిరంతరం రద్దీగా ఉండే నగరంలో ఉండాలని కోరుకున్నారు. అలాగే ఓ సంపన్నవ్యక్తికి ఉండే అన్ని మౌలిక వసతులూ తనకూ ఉండాలనుకున్నారు. అలాంటి రద్దీ నగరంలో, అన్ని వసతులతో ఇల్లు కట్టుకోవాలని కలలు కన్నారు. తర్వాత కష్టపడి తన కలను సాకారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సొంత ఇంటి కల నెరవేర్చుకునే క్రమంలో జరిగిన విశేషాలను ఆయన రియల్ ఎస్టేట్ గురుతో పంచుకున్నారు. అవేంటో చూద్దామా..?

‘మేం చెన్నై వచ్చేనాటికే నగరం చాలా రద్దీగా ఉండేది. జాయింట్ ఇంట్లో నాలుగు కుటుంబాలు కలిసి నివసించేవాళ్లం. అన్నింటికంటే చెత్త ఏంటంటే.. ఉమ్మడిగా ఒకటే మరుగుదొడ్డి ఉండేది. అప్పట్లో అది ఇబ్బందిగా ఉన్నప్పటికీ, నాకు ఆ రోజులు చాలా ఇష్టం. కుటుంబ బంధం వల్ల నేను ఏదో కోల్పోయాననే బాధ నాకు ఎప్పుడూ అనిపించలేదు. అప్పట్లో నాకూ చాలా కోరికలు ఉండేవి. కానీ వాటి గురించి ఆలోచించేవాడిని కాదు. నేను నా తల్లిదండ్రులతో కలిసి బట్టల షాపుకు వెళ్లినట్టు గుర్తు. అక్కడ మా నాన్న మా నలుగురికీ ఒకే రకమైన బట్టలు తీసుకునేవారు. ఇక టైలర్ దగ్గర నియమం ఏమిటంటే.. మా కొలతల కంటే ఒక అంగుళం ఎక్కువ పొడవు పెట్టి బట్టలు కుట్టాలి. అలా చేయడం వల్ల ఆ బట్టలు ఎక్కువ కాలం వేసుకోవడానికి వీలవుతుంది కదా? అందుకే అలా చేయించేవారు. ఇక బార్బర్ వద్దకు తీసుకెళ్లి మా జుట్టును చాలా చిన్నగా కత్తించమనేవారు. అలా ప్రతిసారీ సమ్మర్ కట్ చేయించడంతో నాలుగు నెలల వరకు బార్బర్ అవసరమే ఉండేది కాదు’ అని గుహన్ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

 

గుహన్ ఇల్లు అందమైనదే కాదు.. చాలా ఖరీదైనది కూడా. ‘నేను చిన్నప్పుడు చిన్న ఇళ్లలో ఉన్నాను కాబట్టి, ఇప్పుడు 3600 ఎకరాల కంటే ఎక్కువ ఆస్తిని కొనుగోలు చేశాను. ఇంకా ఇంటీరియర్ చాలా చక్కగా డిజైన్ చేయించాను. నేను ఇంతకుముందు ఏది మిస్ అయ్యానో అలాంటివన్నీ ఇప్పుడు పొందుపరుస్తున్నాను. మీరు మా ఇంట్లో ప్రవేశించిన వెంటనే మీరు నా సాంస్కృతిక మూలాల్లోకి వెళ్లిపోతారు. మొత్తమంతా దక్షిణ భారత అభిరుచులు, సంప్రదాయాలే కనిపిస్తాయి. నాకు ఫైవ్ స్టార్ హోట్ సూట్ దొరక్కపోయినా పర్వాలేదు కానీ, నా ఇంటికి మాత్రం వెంటనే తిరిగి వెళ్లిపోవాల్సిందే’ అని గుహన్ పేర్కొన్నారు. చక్కని లైటింగ్, ఆడంబరమైన ఫ్లవర్ డిస్ ప్లే, పాపింగ్ డోర్స్ లేలా ఆర్ట్.. అవన్నీ ఫ్లాట్ లో ఉన్నా గుహన్ కి ఇష్టమే. ఇంకా ఆయన చెప్పడం కొనసాగిస్తూ.. ‘నా సోదరుడు కూడా దర్శకుడే. మా జీవనశైలి పెరిగిన తర్వాత మేం సొంత ఇంటికి మారాం. అయితే, మేం అనుబంధాన్ని కోల్పోతున్నామనే విషయాన్ని ఆ ఇల్లు చెప్పింది. మేం కేవలం కుటుంబంగా మాత్రమే విడిపోయాం. ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే, ఒకే ఒక్క ఫోన్ కాల్ అందరినీ డిన్నర్ దగ్గరకు తీసుకొస్తుంది. నేను నా విలాసవంతమైన జీవితాన్ని వదులుకుంటాను కానీ, కుటుంబాన్ని వదులుకోను. ఇక నా మొదటి ఇల్లు నాకు పరిశుభ్రత ప్రాముఖ్యతను నేర్పింది. ప్రస్తుతం శానిటైజ్డ్ రెస్ట్ రూం ఉండాల్సిన అవసరం ఏర్పడింది’ అని పేర్కొన్నారు.

గుహన్ చాలా హోమ్లీ వ్యక్తి. షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి రావడాన్ని బాగా ఇష్టపడతారు. షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వంట చేయడాన్ని ఇష్టపడతానని వెల్లడించారు. ఈ ప్రపంచంలోని సొమ్మంతా తన దగ్గర ఉంటే కోయంబత్తూరులో మరో కలల సౌధాన్ని నిర్మిస్తానని గుహన్ తెలిపారు. ఖాళీ సమయాల్లో ప్రశాంతత, ఉత్తేజాన్ని పొందడానికి అక్కడకు వెళతానని పేర్కొన్నారు. అక్కడ లోకల్ బస్సుల్లో ప్రయాణించడం చూస్తారని, అదే నిజమైన జీవితమని వ్యాఖ్యానించారు. తాను అమితంగా ఇష్టపడే ఇల్లు తన మిత్రుడు బొమ్మరిల్లు భాస్కర్ ది అని చెప్పారు. ‘అతడికి చాలా క్లాసీ టేస్ట్ ఉంది. విదేశాల నుంచి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తెప్పించుకోవడం కోసం అతను సంవత్సరాల తరబడి ఎలా ఎదురుచూస్తాడో నాకు చెప్పాడు. అతడికి కావాల్సిన డైనింగ్ టేబుల్ స్థానికంగా దొరకదు. చివరకు నేను కూడా దానిని కొనలేను. అది అంత ఖరీదైనది’ అని గుహన్ వివరించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles