బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా కుటుంబం పుణె కోరెగావ్ పార్క్ లోని బంగ్లాను అద్దెకు ఇచ్చారు. ప్రియాంక తల్లి మధు చోప్రా, సోదరుడు సిద్ధార్థ్ చోప్రాలు 4800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తమ బంగ్లాను నెలకు రూ.2.25 లక్షలకు అద్దెకు ఇచ్చారు. ఐదేళ్ల కాలానికి రూ.1.5 కోట్ల అద్దె రానుంది. దీనిని లాజిక్ ఎంఓ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అద్దెకు తీసుకుంది. ఫిబ్రవరి 24న జరిగిన ఈ లావాదేవీకి రూ.39,000 స్టాంప్ డ్యూటీ, రూ.1,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. అలాగే ఈ లావాదేవీకి రూ.13.5 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్లు పత్రాలు వెల్లడించాయి. లీజుకు 36 నెలల లాక్-ఇన్ పీరియడ్ కూడా ఉంది. లీజు ఒప్పందంలో వార్షిక అద్దె పెరుగుదల 5 శాతంగా ఉంది. ఇది నెలకు రూ. 2.25 లక్షల నుంచి ప్రారంభమై ఐదవ సంవత్సరం నాటికి రూ. 2.73 లక్షలకు పెరుగుతుంది. ఐదు సంవత్సరాల లీజు వ్యవధిలో మొత్తం అద్దె ఆదాయం రూ. 1.49 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
* చోప్రా కుటుంబం 2017 ఆగస్టులో రూ.5.6 కోట్లకు ఈ ప్రాపర్టీ కొనుగోలు చేశారు. మరోవైపు ప్రియాంకా చోప్రా గతనెలలో ముంబై అంధేరి వెస్ట్ లోని ఒబెరాయ్ స్కై గార్డెన్ ప్రాజెక్టులో ఉన్న నాలుగు లగ్జరీ అపార్ట్ మెంట్లను రూ.16.17 కోట్లకు విక్రయించారు. కాగా, డిసెంబర్ 2024 నాటికి కోరెగావ్ ప్రాంతంలో ప్రాపర్ట సగటు ధర చదరపు అడుగుకు రూ. 17,250గా ఉంది. కోరెగావ్ పార్క్ పూణేలోని అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతం. పచ్చదనం, ఉన్నత నివాస ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న కేఫ్ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో వారసత్వ బంగ్లాలు, ఆధునిక అపార్టుమెంట్‌లు, వాణిజ్య అవుట్‌లెట్‌లు ఇలా అన్నీ ఉంటాయి. కళ్యాణి నగర్, పూణే విమానాశ్రయం వంటి కీలక వ్యాపార జిల్లాలకు సమీపంలో ఉండటం వల్ల ఇది ఆకర్షణీయమైన ప్రాంతంగా మారింది.