రాయదుర్గంలోని వాణిజ్య భవనాన్ని విక్రయించలేదని.. కేవలం సబ్ లీజుకిచ్చామని హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైలు గురువారం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. బుధవారం బీఎస్ఈకి అందజేసిన లేఖలో.. రాయదుర్గం బిజినెస్ ను రాఫర్టీ సంస్థకు స్లంప్ సేల్‌లో భాగంగా విక్రయిస్తున్నామని పేర్కొన్న విషయం తెలిసిందే. బీఎస్ఈకి అందజేసిన లేఖలో సబ్ లీజు అనే అంశాన్ని స్పష్టంగా పేర్కొనకుండా.. సేల్ అనే పదాన్ని వాడటం వల్ల.. రియల్ ఎస్టేట్ గురుతో పాటు పలు మీడియా సంస్థలు కథనాల్ని ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ మెట్రో రైలు వివరణ ఇస్తూ.. రవాణా ఆధారిత అభివృద్ధిలోని సబ్ లైసెన్స్ హక్కుల్ని మానిటైజ్ చేసుకున్నామని స్పష్టతనిచ్చింది. ఈ ప్రక్రియకు ఎల్ అండ్ టీ మెట్రో రైలు లిమిటెడ్ బోర్డు ఆమోదం లభించిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందన్నారు. ఈ లావాదేవీ పూర్తి అయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని ఎల్ అండ్ టీ మెట్రో రైలు తెలియజేసింది. అనుమతులన్నీ వచ్చాకే ఈ లావాదేవీ పూర్తి విలువ తెలుస్తుందని తెలిపారు.
This website uses cookies.