Categories: LATEST UPDATES

రియ‌ల్ ఎస్టేట్ లోకి ల‌గ‌డ‌పాటి ప‌ద్మ‌

  • ఆర్ఎన్పీ స్టెల్లార్ ప్రాజెక్టు లైఫ్‌స్ట‌యిల్ బోటిక్ హోమ్స్

పురుషాధిక్య‌త ఎక్కువుండే రియ‌ల్ రంగంలోకి న‌గ‌ర పారిశ్రామిక‌వేత్త ల‌గ‌డ‌పాటి ప‌ద్మ ప్ర‌వేశించారు. ఆర్ఎన్‌పీ స్టెల్లార్ ప్రాజెక్టులో భాగ‌మ‌య్యారు. ప్ర‌భాక‌ర్‌, ర‌మేష్ ప‌టేల్‌, నిషాంత్ చావ్డాల‌తో పాటు ఆమె కొత్త నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. కొండాపూర్‌లో జి+ 15 అంత‌స్తుల ఎత్తులో చేప‌డుతున్న ప్రాజెక్టులో 195 ఫ్లాట్ల‌ను ఈ సంస్థ నిర్మిస్తోంది.

లొకేష‌న్‌, ప్ర‌మోట‌ర్లు, ఆర్కిటెక్ట్‌, డిజైన‌ర్లు, టాటా ప్రాజెక్టు మేనేజ్మెంట్ వంటివి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని ఈ సంద‌ర్భంగా ప‌ద్మ తెలిపారు. నిర్మాణ రంగం అంటే ఎక్కువ సేపు సైట్ల వ‌ద్ద గ‌డ‌పాలి. కంట్రాక్ట‌ర్లు, పనివాళ్ల‌తో డీల్ చేయాలి. అందుకే పురుషాధిక్యత ఎక్కువ‌గా ఉంటుందీ రంగంలో. మ‌రి, ఇందులోకి ఎందుకు ప్ర‌వేశించారు? అని ప‌ద్మ‌ని ప్ర‌శ్నిస్తే.. ఇలా చెప్పుకొచ్చింది. ఈ రంగం నాకు కొత్తేం కాదు. మా కుటుంబం ఎప్ప‌ట్నుంచో ఈ రంగంతో ముడిప‌డి ఉంది. ఈ వ్యాపారం గురించి నాకు మంచి అవ‌గాహ‌న ఉంది. పైగా, మ‌హిళ‌లు రియ‌ల్ రంగంలో మెరుగైన రీతిలో ప‌ని చేస్తున్నారు. అటు కుటుంబాన్ని చ‌క్క‌దిద్దుకోవ‌డంతో పాటు వ్యాపారాన్ని స‌మ‌ర్థంగా నిర్వ‌హించే మ‌ల్టీ టాస్కింగ్ చేయ‌గ‌ల‌రు. మ‌హిళ‌లు ఈ రంగంలోని వివిధ విభాగాల్లో సానుకూల దృక్ప‌థంతో దృష్టి పెట్ట‌గ‌ల‌రు. దృఢంగా వ్య‌వ‌హ‌రిస్తారు. అందుకే, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ రంగంలో ఎక్కువ‌గా మ‌హిళ‌లూ ప్ర‌వేశిస్తున్నార‌ని వివ‌రించారు.

This website uses cookies.