poulomi avante poulomi avante

బంజారాహిల్స్‌లో భూముల వేలం?

కాంగ్రెస్ స‌ర్కార్ ఫ‌స్ట్ ల్యాండ్ సేల్‌

వేలంలో ప్ర‌జ‌లొచ్చి కొనే ప‌రిస్థితి ఉందా?

సొంతిల్లు అంటేనే బ‌య్య‌ర్లు ప్యానిక్‌
క‌నీస గజం 300 గ‌జాలు..

ధ‌ర‌.. గ‌జానికి 1.8-2 ల‌క్ష‌లు

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన భూముల వేలాన్ని.. కాంగ్రెస్ పార్టీ నేత‌గా త‌ప్పుప‌ట్టిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. భూముల అమ్మ‌కంపై దృష్టి సారించారు. పైగా, బంజారాహిల్స్ వంటి ఖ‌రీదైన ప్రాంతంలో భూముల్ని అమ్మేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నార‌ని తెలిసింది. దీన్ని ద్వారా సుమారు వెయ్యి కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని ఆర్జించేందుకు ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని స‌మాచారం. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పును కాంగ్రెస్ స‌ర్కార్ చేయ‌ద‌ని ప్ర‌జ‌లు భావిస్తే.. హెచ్ఎండీఏ ఏమో ఏకంగా బంజారాహిల్స్ భూముల్ని అమ్మ‌డంపై దృష్టి సారించ‌డాన్ని ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

పైగా, రియ‌ల్ మార్కెట్‌ను పూర్తిగా కుంగ‌దీసిన రేవంత్ స‌ర్కార్‌.. ఇప్పుడీ భూముల్ని వేలం వేసినా కొనేందుకు అటు బ‌య్య‌ర్లు కానీ ఇటు సంస్థ‌లు కానీ ముందుకొచ్చే ప‌రిస్థితి లేద‌ని చెప్పొచ్చు. ఎందుకంటే, రేవంత్ రెడ్డి సీఎం అయిన‌ప్ప‌ట్నుంచి.. కేవ‌లం మూసీ మీద దృష్టి పెట్టారే త‌ప్ప‌.. రియ‌ల్ రంగానికి సంబంధించిన త‌మ పాల‌సీని ఇప్ప‌టివ‌రకూ అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. రియాల్టీకి పెద్ద‌గా ప్రోత్సాహం ల‌భించ‌ని స‌మ‌యంలో.. ఇంత ఖ‌రీదైన భూముల్ని ఎవ‌రు కొంటార‌నేది సందేహాస్పదంగా మారింది.

తెలంగాణ ప్రభుత్వం అదనపు ఆదాయానికి వేట మొదలు పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు సహా ఉద్యోగుల జీతాలు, అభివృద్ది-సంక్షేమ కార్యక్రమాలకు సర్కార్ ఖజానా ఏ మాత్రం సరిపోవట్లేదు. పైగా అప్పులకు వడ్డీలు, నెలవారి వాయిదాలు తెలంగాణ ప్రభుత్వంపై అదనపు భారం మోపుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు అవసరాల కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే హైదరాబాద్ లో భూములను అమ్మాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే ఈసారి హైదరాబాద్లో అత్యంత ఖరీదైన భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ రంగం సిద్ధం చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ సమీపంలో హెచ్‌ఎండీఏకు 12 ఎకరాల అతి ఖరీదైన భూమిని విక్రయించాల‌ని నిర్ణ‌యించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోకాపేట, బుద్వేల్, మోకిల తదితర ఖరీదైన ప్రాంతాల్లో ప్లాట్లు వేలం ద్వారా 3 వేల కోట్లపైనే ఖజానాకు ఆదాయం సమకూరింది. అదే తరహాలో హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములను విక్రయించి ఖజానాను నింపాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.

వేలంలో ఆరంభ గజం ధరను హెచ్‌ఎండీఏ నిర్ణయిస్తుంది. కనీస ధర చదరపు గజానికి రూ.1.8 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు నిర్ణయించే అవకాశ‌ముందని సమాచారం. మొత్తం 12 ఎకరాలను ప్లాట్లుగా అభివృద్ది చేసి.. ఒక్కో ప్లాట్‌ను 300 నుంచి 600 చదరపు గజాల వరకు ప్లాట్లను విభజించి వేలం వేస్తార‌ని తెలిసింది. 300 చదరపు గజాల ప్లాటుకు ప్రారంభ నిర్ధారిత ధర రూ. 5.4 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయల వరకు నిర్ణ‌యిస్తార‌ని స‌మాచారం. ఆపై వేలంలో ఎక్కువకు పాడుకున్న బిడ్డర్‌కు ప్లాటును కేటాయిస్తారు. ఈ క్ర‌మంలో ప్రభుత్వ అనుమతి కోసం హెచ్ఎండీఏ నివేదిక పంపినట్లు తెలిసింది.

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలిసింది. దీంతో పాటు ఉప్పల్ భ‌గాయత్లో మిగిలిన మరికొన్ని ప్లాట్లను వేలం వేస్తార‌ని స‌మాచారం. హైదరాబాద్ లో చతికిల పడ్డ రియల్ మార్కెట్‌ కాస్త కోలుకున్నాక.. బుద్వేల్ సహా మరి కొన్ని ప్రాంతాల్లో భూములను వేలం వేసేందుకు ప్లాన్ చేస్తోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles