వాసవి గ్రూప్ ఏం చేసినా భిన్నంగానే ఉంటుంది. వాసవి ఆనంద నిలయం లాంచ్ అయినా, వాసవి సరోవర్ ప్రారంభోత్సవమైనా.. అందరికంటే విభిన్నంగా.. మార్కెట్లోనే టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిర్వహిస్తుంది. ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు గల వాసవి గ్రూప్.. ఇటీవల వాసవి ఆవాస అనే ప్రీమియం గేటేడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. మరి, రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేక స్టోరీ మీకోసం..
వాసవి గ్రూప్ కొంపల్లిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న వైబ్రంట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టే.. వాసవి ఆవాసా. ఇందులో మొత్తం వచ్చేవి దాదాపు 59 లగ్జరీ విల్లాలు. ఒక్కో విల్లాను నాలుగు వేల ఐదు వందల పదిహేను చదరపు అడుగుల నుంచి నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.
ఈ 59 విల్లాల నివాసితుల కోసం సుమారు పదమూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌజ్‌ను నిర్మిస్తున్నారు. నివాసితుల కోసం అవసరమయ్యే సమస్త లగ్జరీ సదుపాయాల్ని ఇందులో పొందుపరుస్తారు. యాంఫి థియేటర్, నెట్ క్రికెట్, బ్యాడ్మింటన్, యోగా స్పేస్, ఔట్‌డోర్ మరియు ఇండోర్ జిమ్, గ్రాండ్ బ్యాంకెట్ హాల్ వంటివి డెవలప్ చేస్తారు.
వాసవి ఆవాసా గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ అడ్వాంటేజ్ ఏమిటంటే.. గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్ కు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండున్నర కిలోమీటర్ల దూరంలో రెండున్నర కిలోమీటర్ల దూరం, ఎన్‌హెచ్ ఫార్టీ సెవెల్ నాలుగు కిలోమీటర్లు, జేబీఎస్ మెట్రో స్టేషన్ పదిహేను కిలోమీటర్లు, సికింద్రాబాద్ స్టేషన్ పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆరంభించిన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఎంతో చేరువగా ఉంటుందీ వాసవి ఆవాసా.
వాసవి ఆవాసా నుంచి ఆస్పత్రులు కూడా చేరువలోనే ఉంటాయని గుర్తుంచుకోండి. రామ్ హాస్పిటల్స్ 5 కిలోమీటర్లు, నారాయణ హృదయాలయ ఆరు కిలోమీటర్లు, ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ్నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రాలకు సులువుగా చేరుకోవచ్చు. ధోలా రి ధని మూడు కిలోమీటర్లు, సినీ ప్లానెట్ ఐదు కిలోమీటర్లు, ప్రముఖ దాబాలు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
This website uses cookies.