Categories: LATEST UPDATES

ప్లాస్టిక్ కు బ్రేకప్ చెబుదాం

పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో ద వుడ్స్ కొత్త ప్రచారం

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ పెనుభూతం పర్యావరణానికి పెను సవాళ్లు విసురుతోంది. దీని వినియోగం తగ్గించడానికి పలు దేశాలు కొన్ని చర్యలు కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శంషాబాద్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ద వుడ్స్ ‘బ్రేకప్ విత్ ప్లాస్టిక్’ ప్రచారం నిర్వహించింది. వుడ్స్ లోని జూనియర్ ఇంటర్న్స్ బృందం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఉపయోగించిన చీరలు, మెటల్ స్ట్రాలు, మగ్ లు, వెదురు టూత్ బ్రష్ లతో తయారు చేసిన పర్యావరణ అనుకూలమైన పునర్వినియోగ బట్టల సంచులతో కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవాలో వివరించింది. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం ద్వారా భూమికి ఎలా మేలు చేయవచ్చో తెలిపింది. ఈ సందర్భంగా వుడ్స్ లో వందకు పైగా చెట్లు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కళ, వ్యక్తిగత చర్యల ప్రాముఖ్యతను వివరించడానికి కుండలు తయారు చేయడం, పెయింటింగ్ వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేశారు.

This website uses cookies.