కోకాపేట్ కాకుండా మహేశ్వరాన్ని న్యూయార్క్ స్థాయిలో డెవలప్ చేస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని 69 శాతం ప్రజలు నమ్మట్లేదని రెజ్ టీవీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఎయిర్ పోర్టు- రాయదుర్గం మెట్రో, ఫార్మా కారిడార్ వంటివి రద్దు.. కోకాపేట్ బదులు మహేశ్వరం డెవలప్మెంట్.. ఇలా సీఎం రేవంత్ తప్పడు నిర్ణయాల వల్ల హైదరాబాద్ రియాల్టీ దెబ్బ తిన్నదని సుమారు 68 శాతం మంది అభిప్రాయపడ్డారు.
కాకపోతే, ట్రిపుల్ ఆర్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులొస్తాయని 69 శాతం మంది తెలిపారు. అయితే, మహేశ్వరం బదులు తొలుత కోకాపేట్‌ను అభివృద్ధి చేయాలని 16 శాతం అన్నారు.
This website uses cookies.