కొండాపూర్ చేరువలో ఆర్‌వీ శిల్పా హోమ్స్ నిర్మిస్తున్న ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ గోల్డ్ రేటింగ్ ప్రాజెక్టే.. శిల్పాస్ ఆర్‌వీ విభుమన్. ఈ సంస్థ ఎక్కడ ప్రాజెక్టును చేపట్టినా.. అందులో నివసించేవారి లగ్జరీ, కంఫర్ట్, కన్వీనియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సుస్థిరమైన గృహాల్ని తీర్చిదిద్దుతుందనే విషయం తెలిసిందే. ఎకో ఇంటెలిజెంట్ హోమ్స్ ప్రాజెక్టు అయిన ఆర్‌వీ విభుమన్‌లో స్మార్ట్ హోమ్ ఆటోమేషన్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడం వల్ల కార్బన్ ప్రింట్ గణనీయంగా తగ్గుతుంది. అరవై శాతం ఫ్లాట్లు ఓపెన్ స్పేస్ వైపు ఫేసింగ్ ఉండటమే కాకుండా ల్యాండ్ స్కేప్ గార్డెన్స్‌కు పెద్దపీట వేశారు. శిల్పా’స్ ఆర్‌వీ విభుమన్ ప్రాజెక్టు సుస్థిరమైన స్మార్ట్ గ్రీన్ లివింగ్‌కు నిదర్శనమని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఆలోచనాపూరితమైన డిజైన్, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ వాడకం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మొత్తానికి ఆధునిక లగ్జరీ ప్రకృతిని కలగలిపే ప్రాజెక్టే.. శిల్పాస్ ఆర్‌వీ విభుమన్ అని సగర్వంగా చెప్పొచ్చు.
టీఎస్ రెరా అనుమతి గల ప్రాజెక్టును సుమారు 1.53 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య.. 174 కాగా, టూ మరియు త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. టూ బెడ్‌రూం ఫ్లాట్లు 1314 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తుండగా.. ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లను 1863 చదరపు అడుగుల్లో కడుతున్నారు. ఆర్‌వీ శిల్పా హోమ్స్ ఎక్కడ ప్రాజెక్టును ప్రారంభించినా ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేస్తుందనే విషయం తెలిసిందే. వాస్తు సూత్రాలకు అనుగుణంగా నిర్మిస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో ప్రత్యేకంగా క్లబ్ హౌజ్ పొందుపరిచారు. ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ వంటివి ఏర్పాటు చేస్తారు.
చిల్డ్రన్స్ ప్లే ఏరియాకు పెద్దపీట వేశారు. నివాసితుల భద్రత కోసం కమ్యూనిటీలో సీసీటీవీ, మల్టీపర్పస్ హాల్, యోగా, మెడిటేషన్ హాల్ వంటివి ఏర్పాటు చేస్తారు. నీటి సామర్థ్యం, ఇంధన సామర్థ్యం, పర్యావరణహితమైన మెటీరియల్ వినియోగం, వ్యర్థాల తగ్గింపు, మన్నికైన, నిర్వహించదగిన డిజైన్, లోపల గదుల్లో నాణ్యత కలిగిన గాలి వంటి అంశాలు సుస్థిర నిర్మాణానికి నిదర్శనాలు. సమర్థవంతమైన ప్లంబింగ్ ఫిక్చర్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, మురుగునీటి శుద్ధి వ్యవస్థలు ఏటా బోలెడంత నీటిని ఆదా చేస్తాయి. అలాగే లో పవర్ ఎస్టీపీ, సోలార్ వాటర్ హీటర్స్, ఎల్ఈడీ లైట్లు, 5 స్టార్ రేటెడ్ పంపులు, మోటార్లు ఏటా చాలా విద్యుత్ ను ఆదా చేస్తాయి. మొత్తమ్మీద అటు నీరు, ఇటు విద్యుత్ ఆదాతోపాటు వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణ ఏటా చాలా సొమ్మును మిగులుస్తాయి.
ప్రస్తుతం అందరూ విశాలమైన, విలాసవంతమైన ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో ఆటోమేషన్ కూడా కావాలనుకుంటున్నారు. అలెక్సా.. స్విచ్ ఆన్ ది లైట్స్ అంటే లైట్లు వెలుగుతాయి. ఇలాంటి సాంకేతికత జీవనశైలిని మరింత మెరుగ్గా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టులో ఆటోమేషన్ కూ పెద్దపీట వేశారు. చిన్నచిన్న కమాండ్లతో మీ ఇంటి ఉపకరణాలను మీ చెప్పుచేతల్లో ఉంచుకోవచ్చు. స్మార్ట్ లైటింగ్ కంట్రోల్ తోపాటు, స్మార్ట్ ఫ్యాన్ కంట్రోల్ వంటివి పొందుపరుస్తున్నారు.
ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న లొకేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతర్జాతీయ స్కూళ్లు, యూనివర్శిటీలకు ఐదు నుంచి పదిహేను నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఇక్కడ్నుంచి బొటానికల్ గార్డెన్ ఐదు నిమిషాలే, పది నిమిషాల్లో ఐకియాకు వెళ్లొచ్చు. కార్పొరేట్ ఆఫీసులు, ఆస్పత్రులకు ఐదు నుంచి పది నిమిషాల్లో వెళ్లొచ్చు. ఐదు నిమిషాల దూరంలో బీహెచ్ఈఎల్ ఉండగా.. మైండ్ స్పేస్, సైబర్ టవర్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డుకు 10 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
కరోనా తర్వాత అంతా పచ్చదనం, తాజా గాలిని కోరుకుంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని మరీ అందుకు తగినట్టుగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. లోపల సైతం తాజా గాలి వచ్చేలా శ్రద్ధ తీసుకున్నారు. ఇందుకోసం హ్యాంగింగ్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా లోపలకు తాజా గాలి రావడమే కాకుండా ఆహ్లాదకరమైన, చల్లని వాతావరణంతో పాటు కనులకు విందుగా కూడా ఉంటుంది. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఆర్వీ విభుమన్ మిస్ చేసుకోకండి. స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సులు వంటి వాటికి చేరువగా ఉండాలని కోరుకుంటే మాత్రం.. ఒక్కసారి ఆర్‌వీ విభుమన్‌ను సందర్శించాల్సిందే. గతేడాది ప్రాజెక్టు ఆరంభం కాగా నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.
This website uses cookies.