మాదాపూర్‌లో అయితే ఫ్లాట్ ఎంతకొస్తుంది? కొండాపూర్‌లో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులేమిటి? గచ్చిబౌలిలో కొనుగోలు చేయడం కరెక్టా? కోకాపేట్‌లో కొంటే బెస్టా? కాస్త రేటు తక్కువగా పెట్టేవారికి నార్సింగి, మంచిరేవుల, కిస్మత్ పురాలో ఉన్న ఆప్షన్లు ఏమిటి? ఎల్ బీ నగర్‌లో ఎంత చెబుతున్నారు? మణికొండలో ఎంతకు అమ్ముతున్నారు? ఇలా, హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే, మీలాంటి వారి కోసమే ఈ కథనం.
హైదరాబాద్‌లో సొంతిల్లు కొనుక్కోవాలని చాలామందికి ఉంటుంది. కానీ, పెరిగిన ధరల నేపథ్యంలో అతి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరమేర్పడింది. ఏయే సంస్థ ఎన్ని ఎకరాల్లో ప్రాజెక్టును కడుతోంది? అందులో వచ్చే ఫ్లాట్లు ఎన్ని? ఎంత ఎత్తులో టవర్లు కడుతున్నారు? వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారు? వంటి విషయాలపై పక్కాగా తెలుసుకోవాల్సిందే. ఏయే ప్రాజెక్టులో ఎంత రేటు చెబుతున్నారు? అదే ధరకు ఇతర ప్రాంతాల్లో లభిస్తున్న ప్రాజెక్టులేమిటి? అందులో పొందుపర్చే సదుపాయాలేమిటి? ఇలా ప్రతి అంశాన్ని పక్కాగా బేరీజు వేసుకున్నాకే.. చాలామంది సొంతింటి నిర్ణయానికి వస్తున్నారు.
ప్రస్తుతం అపార్టుమెంట్ ఏయే స్థాయిలో ఉంది? ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? అసలు పూర్తి చేసే సామర్థ్యం ఆయా బిల్డరుకు ఉందా? వంటి అంశాల గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటికే, నిర్మాణం ఆరంభమైతే గనక ఎన్నేళ్ల నుంచి ఆయా అపార్టుమెంటును కడుతున్నారు? ఇంతవరకూ అందులో ఏయే కారణాల వల్ల ఫ్లాట్లు అమ్ముడవ్వడం లేదనే విషయాల్ని ఆరా తీస్తున్నారు. మొత్తానికి, సొంతింటి ఎంపికకు సంబంధించి.. మీకు సమస్త సమాచారం అందించేందుకు.. రియల్ ఎస్టేట్ గురు ఈవారం మీకోసం ప్రత్యేకంగా.. నగరంలో పలు సంస్థలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాల్ని అందజేస్తోంది.
హైదరాబాద్‌లో నిర్మాణాలు ఎక్కువగా జరిగే కొన్ని ప్రాంతాల్ని గుర్తించి.. ఆయా ఏరియాలో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టుల వివరాల్ని నేటి నుంచి రియల్ ఎస్టేట్ గురు ప్రత్యేకంగా ప్రచురిస్తుంది. మహేశ్వరం నుంచి మణికొండ.. కొల్లూరు నుంచి కోకాపేట్.. బంజారాహిల్స్ నుంచి బండ్లగూడ దాకా పలు సంస్థలు వివిధ ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నాయి. మరి, అవి ఏయే స్థాయిలో ఉన్నాయి? అందులో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నవేవి? ఈ కింద వివరాల్ని చూస్తే మీకే అర్థమవుతుంది.
This website uses cookies.