Categories: AREA PROFILE

గోవాలో లగ్జరీ విల్లా

  • పాడీ ఫీల్డ్ వ్యూతో విల్లామారిస్ సన్ రిడ్జ్ ప్రాజెక్టు

టూరిస్టుల ఇష్టమైన పర్యాటక ప్రాంతం గోవాలో లగ్జరీ విల్లా కోసం చూస్తున్నవారికి శుభవార్త. గోవాలోని పర్రాలో విల్లామారిస్ సంస్థ సన్ రిడ్జ్ పేరుతో అదిరిపోయే విల్లా ప్రాజెక్టు చేపట్టింది. వరి పొలాల అద్భుతమైన వ్యూ వీటికి మరో అదనపు ఆకర్షణ. నార్త్ గోవాలోని ప్రధాన బీచ్ లు, ఫేమస్ కేఫ్ లు, రెస్టారెంట్లు, క్లబ్ లకు దగ్గర్లో ఉంది. మొత్తం 10 విల్లాలు రూపు దిద్దుకుంటున్నాయి.

డబుల్ హైట్ లివింగ్ రూమ్, అద్భుతమైన మాడ్యులర్ కిచెన్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఇన్ఫినిటీ పూల్, దాని చుట్టూ గార్డెన్ కూడా ఉంది. 148.82 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాతో 3 బీహెచ్ కే, 257.31 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాతో 4 బీహెచ్ కే, 250.23 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాతో 5 బీహెచ్ కే విల్లాలు అందుబాటులో ఉన్నాయి. పెద్ద కామన్ గార్డెన్ తోపాటు ప్రైవేట్ గ్లాస్ లిఫ్ట్, సీసీటీవీ కెమెరా, 24 గంటల సెక్యూరిటీ, సర్వెంట్ క్వార్టర్లు, ప్రైవేటు స్విమింగ్ పూల్, యోగా స్పేస్, పార్టీ జోన్, వంటి పలు సౌకర్యాలు ఉన్నాయి. ధర రూ.4.64 కోట్ల నుంచి ప్రారంభం కానుంది. నమూనా విల్లా రెడీగా ఉంది. వెంటనే ఓ లుక్కేసి రండి.

This website uses cookies.