హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ మంజీరా గ్రూప్.. రాజమండ్రిలో ఫైవ్ స్టార్ హోటల్‌ను ఆరంభించింది. సుమారు 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో.. 150 ఎకరాల్లో ఈ హోటల్‌ను నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పీపీపీ విధానంలో చేపట్టిన ఈ హోటల్‌లో 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బ్యాంకెట్ హాళ్లను నిర్మించింది. ఇది ఏకకాలంలో 5000 మంది గెస్టులకు సరిపోతుంది. 105 గదులు గల ఈ బిజినెస్ హోటల్‌లో డీలక్స్, సూట్ గదులున్నాయి.
ఈ సందర్భంగా సంస్థ సీఎండీ జి.యోగానంద్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్‌లని మా మొదటి హోటల్ రాజమండ్రిలో ‘మంజీర సరోవర్ ప్రీమియర్’ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రి, భారత ఉపఖండంలోని పురాతన నగరాలలో ఒకటిగా ఉంది, ఒకప్పుడు శక్తివంతమైన చాళుక్యుల స్థానంగా ఉన్న ఏపీ యొక్క ‘సాంస్కృతిక రాజధాని’, దాని గొప్ప సంప్రదాయం, కళలు మరియు సంస్కృతికి ప్రసిద్ధి చెందిందని తెలిపారు.
తమ హోటల్ వ్యాపార ప్రయాణికులు మరియు పర్యాటకులను సులభతరం చేస్తుందన్నారు. ఈ హోటల్‌ను నిర్మించేందుకు సహకరించిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు, అవసరమైన అనుమతులు మంజూరు చేసినందుకు స్థానిక సంస్థలకు మరియు ప్రాజెక్ట్‌కి ఆర్థికంగా తమ సహాయాన్ని అందించినందుకు టూరిజం ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ అయోధ్యరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
This website uses cookies.