హైదరాబాద్ నిర్మాణ రంగంలో 33 ఏళ్ల అనుభవం గల ఆర్క్ హోమ్స్ సంస్థ.. బాచుపల్లిలో ప్రప్రథమంగా చిల్డ్రన్ ఫ్రెండ్లీ హోమ్స్‌కు శ్రీకారం చుట్టింది. దీనికి ఆర్క్ సమ్యక్ అని నామకరణం చేసింది. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో వచ్చేవి 160 ఫ్లాట్లు. రెండు టవర్లలో పది ఫ్లోర్లను నిర్మిస్తోంది. ఫ్లాట్ల విస్తీర్ణం 1315 నుంచి 1760 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐజీబీసీ గోల్డ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ధర విషయానికి వస్తే.. చదరపు అడుక్కీ రూ. 5,500 చెబుతున్నారు. ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేసేందుకు సంస్థ ప్రణాళికల్ని రచిస్తోంది.
కొవిడ్ సమయంలో చిన్నారులు ఇంటికే పరిమితమయ్యారు. వారు బయటికి వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. ఈ ఇబ్బందిని గమనించిన తర్వాతే.. కిడ్స్ ఫ్రెండ్లీ ఇళ్లను నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సంస్థ సీఈవో గుమ్మి మేఘన తెలిపారు. చిన్నారులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఆడుకునే విధంగా ఇంటీరియర్స్ మరియు ఎక్స్‌టీరియర్స్ డిజైన్ చేశామన్నారు. క్లబ్ హౌజ్లో కేవలం చిన్నారులు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ప్లే సెంటర్‌కు రూపకల్పన చేశామని, ల్యాండ్ స్కేప్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఈ ప్రాజెక్టును డిజైన్ చేసేటప్పుడే ప్రతి చిన్న విషయానికీ పరిష్కారం చూపెట్టామని వివరించారు. బుడతల కోసం సాకెట్లను వివిధ ఎత్తులో ఏర్పాటు చేశామన్నారు.
This website uses cookies.