శుక్రవారం ఖానామెట్ వేలం పాటల్లో ఐదు ప్లాట్లను స్థానిక సంస్థలే దక్కించుకున్నాయి. దాదాపు 14.91 ఎకరాల ఈ ఐదు ప్లాట్లను వేలం నిర్వహించగా.. రూ.729.41 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాలో వచ్చి చేరింది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలం పాటల్లో నగరానికి చెందిన మంజీరా కన్ స్ట్రక్షన్స్ దాదాపు మూడు ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకుంది. మాదాపూర్ హైటెక్ సిటీకి చేరువలో ఉన్న ఖానామెట్ ఉండటం.. ఇక్కడే ఐటీ కంపెనీలన్నీ కొలువుదీరటంతో మంజీరా సంస్థ సుమారు 2.92 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకుంది.
ఇందుకోసం అందరికంటే అత్యధికంగా ఎకరాకు రూ.55 కోట్లను వెచ్చించింది. అంటే, ఈ స్థలం కోసం దాదాపు రూ.160.60 కోట్లు పెట్టి ఈ స్థలాన్ని మంజీరా కన్ స్ట్రక్షన్స్ సొంతం చేసుకుంది. టెలికమ్యూనికేషన్స్ లో పేరెన్నిక గల సంస్థ లింక్ వెల్ సిస్టమ్స్ రెండు బిట్లను కైవసం చేసుకుంది. 5.15 ఎకరాల కోసం సుమారు రూ.245.49 కోట్లు వెచ్చించింది. అప్ టౌన్ లైఫ్ ప్రాజెక్ట్స్ సంస్థ 3.15 ఎకరాల కోసం రూ.137.34 కోట్లు.. జీవీపీఆర్ ఇంజినీర్స్ 3.69 ఎకరాల నిమిత్తం రూ.185.98 కోట్లు పెట్టి స్థలాన్ని సొంతం చేసుకుంది.
This website uses cookies.