Categories: LATEST UPDATES

కరెంటు, నీళ్ల లేక ఫ్లాట్ యజమానుల ఆందోళన

వారంతా సమస్త సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన జీవితం గడపడానికి కోట్లు వెచ్చించి హైరైజ్ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. కానీ అక్కడ కరెంటు, నీళ్లు వంటి కనీస సదుపాయాలు కూడా కరువడంతో ఆందోళన బాట పట్టారు. గుర్గామ్ లోని సెక్టార్ 79లో మేప్స్ కో మౌంట్ విల్లే కమ్యూనిటీ ఉంది. అయితే, అందులోని అపార్ట్ మెంట్లకు నీళ్లు, కరెంటు సరిగా లేకపోవడంతో విల్లా యజమానులు బిల్డర్ కి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. సొసైటీ ప్రస్తుతం డీజిల్ జనరేటర్ పై నడుస్తోందని.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకుని రెండేళ్లయినా బిల్డర్ ఇంకా డొమెస్టిక్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేయలేని విల్లా యజమానులు ఆరోపించారు.

ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 300 కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకున్నారని.. ప్రస్తుతం సొసైటీకి 2100 కేవీ అవసరమని.. అయితే, అంత సామర్థ్యం లేకపోవడం వల్ల ప్రతిరోజూ రాత్రి కనీసం 50 సార్లు కరెంట్ ట్రిప్ అవుతోందని పేర్కొన్నారు. దీంతో తమకు అన్నీ నిద్ర లేని రాత్రుళ్లే అవుతున్నాయన్నారు. అలాగే గత 20 గంటలుగా ఏ ఒక్క టవర్ కీ నీటి సరఫరా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీటిని స్నానం చేయడానికి, టాయిలెట్ కోసం వినియోగిస్తున్నట్టు చెప్పారు. 2021లో ఈ ప్రాజెక్టు లాంచ్ చేయగా.. 2020 డిసెంబర్ నుంచి అప్పగింత ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం అక్కడ 400కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి.

This website uses cookies.