రెజ్‌టీవీ 2025 క్యాలెండర్ని చూశాక..
బిల్డర్ల నోట ఇదే మాట..
కొత్త సంవత్సరం సందర్భంగా అధిక శాతం నిర్మాణ సంస్థలు, రియల్ కంపెనీలు న్యూ ఇయర్ క్యాలెండర్లను ప్రింట్ చేయడం.. తమ కస్టమర్లు, శ్రేయోభిలాషులకు ఇవ్వడం సర్వసాధారణమే. అయితే, ఇందుకు భిన్నంగా రెజ్ టీవీ ఏం చేసిందంటే.. హైదరాబాద్‌లో పేరెన్నిక గల కొన్ని నిర్మాణ సంస్థల్ని ఒక ప్లాట్‌ఫారం మీదికి తీసుకొచ్చి.. ప్రత్యేకంగా 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ప్రింట్ చేసింది. ఇందులో మైహోమ్, రాజపుష్ప, వాసవి, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, సుమధుర గ్రూప్, గిరిధారి హోమ్స్, జీహెచ్ఆర్ కలిస్టో, క్యాండియర్ డెవలపర్స్, శ్రియాస్ లైఫ్ స్పేసెస్, రఘురాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టీఎన్ఆర్ గ్రూప్, గౌతమీ డెవలపర్స్ వంటివి పాల్గొన్నాయి. ఈ 2025 క్యాలెండర్‌ని చూసిన పలువురు డెవలపర్లు.. తాము అనుకున్న దానికంటే క్వాలిటేటివ్‌గా వచ్చిందని అభిప్రాయపడ్డారు. కొత్త సంవత్సరం నిర్మాణ రంగానికి మేలు కలగాని ఆశించారు. రె రెజ్ టీవీ ఫౌండర్ కింగ్ జాన్సన్ కొయ్యడకి కంగ్రాట్స్ చెప్పారు.