కొల్లూరుకి డిమాండ్ ఏర్పడటానికి ప్రధాన కారణం డెవలప్మెంట్ ఏరియాలకు దగ్గరగా ఉండటం. అలాగే ఈ ఏరియా చుట్టు పక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో 100 ఫీట్ రోడ్లు మరో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కోకాపేట- ఐటీ కారిడార్‌కు అడ్డా అయితే.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ సమీపంలోని గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, తెల్లాపూర్, కొల్లూరు ప్రాంతాలు అత్యాధునిక నివాసాలకు కేంద్రాలుగా మారాయ్. తెల్లాపూర్ తర్వాత కొల్లూరు ఏరియానే రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తోంది. కొల్లూరులో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్ట్‌లు, హైరైజ్ అపార్ట్‌మెంట్లే ఎక్కువగా ఉంటున్నాయ్. పెద్ద ఎత్తున జరుగుతోన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల నిర్మాణంతో కొల్లూరు ఐటీ కారిడార్‌లో మోడ్రన్ టౌన్‌షిప్‌గా మారుతోంది.
కొల్లూరులో 15 ఏళ్ల క్రితం ఎకరం ధర లక్షల్లో ఉంటే.. ఇప్పుడు కోట్లు పలుకుతోంది. కొన్నేళ్ల క్రితం వరకు గ్రామ పంచాయితీగా ఉన్న కొల్లూరు ప్రస్తుతం తెల్లాపూర్ మున్సిపాల్టీ పరిధిలోకి వెళ్లడంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పుంజుకోని భూముల ధరలూ ఒక్కసారిగా పెరిగాయ్. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ సహా ఐటీ కంపెనీల్లో వర్క్ చేస్తోన్న ఎందరో సమీపంలోని తెల్లాపూర్, కొల్లూరు ప్రాంతాల్లోనే నివాసం ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా ఇక్కడ కన్‌స్ట్రక్టవుతోన్న ఒక్కో ప్రాజెక్ట్ 25, 50, 100 ఎకరాల్లో ఉంటున్నాయ్. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టే ఐటీ ఎంప్లాయిస్‌తో పాటు బిజినెస్, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా కొల్లూరులో ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం..! 2025లో డిమాండ్ ఉన్న ఏరియాలో ఓన్ హౌస్ కావాలనే ఆలోచన ఉంటే కొల్లూరు వైపు మీరూ ఓ లుక్కేయండి.