సొంతింటి కోసం కలలు కనే వారిలో ఈసారి కాస్త మార్పు వచ్చింది. ఈ విషయంలో నటి మృణాళిని రవి మనల్ని తన కలల ఇంటికి తీసుకెళ్లారు. తన ఇల్లు ఎలా ఉండాలనే అంశంపై గతంలో ఆమె కన్న కలనే నెరవేర్చుకోవాలని గట్టి తలంపుతో ఉన్నారు. ఇంటికి పునాది రాయి వేయడం చాలా కష్టం. కానీ అది ఓ లాభదాయకమైన పనికి చిహ్నం. అన్నట్టు మృణాళిని రవి కలల నగరం ఏదో తెలుసా? బెంగళూరు. మరి సొంతింటికి సంబంధించి ‘రియల్ ఎస్టేట్ గురు’తో ఆమె పంచుకున్న విశేషాలు ఏమిటో చూద్దామా?
‘ఇప్పుడు కూడా నేను కనీస కోరికలు లేని సాధారణ వ్యక్తిని. అప్పుడు నా తల్లిదండ్రులు నా చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రశాంతతను, సింపుల్ గా ఉండే అందాన్ని తిరస్కరించడం చాలా కష్టం. ఇక ఇంట్లో స్థలాన్ని చాలా సాధారణంగా ఉంచాలని అనుకుంటాను. అదే సమయంలో ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటాను. నటిగా చాలా బిజీ షెడ్యూల్ లో ఉండే నేను.. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ప్రశాంతత కావాలనుకుంటాను. అక్కడ ఎలాంటి గందరగోళానికి తావు ఉండకూడదని కోరుకుంటాను. నేను నా ఇంటికి ఏది తీసుకువచ్చినా.. అది విలువ జోడించేది మాత్రమే అయి ఉంటుంది’ అని మృణాళిని పేర్కొన్నారు.
భవిష్యత్తులో బంగ్లా కలిగి ఉండాలనే ఆకాంక్షను వెల్లడించిన మృణాళిని.. జనజీవనం నుంచి దూరంగా వెళ్లాలనే కోరికను మాత్రం తగ్గించుకున్నారు. ఆమెకు ఇప్పుడు అందరికీ సరిపోయే ఇల్లు కావాలని మాత్రమే ఉంది. ‘నా ఇల్లు నా కంటే ఎక్కువగా నా కుటుంబానికి సౌకర్యంగా ఉండాలి. విశాలమైన ప్రదేశం కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. నాకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవడం కోసం నేను ఓ మైలు ఎక్కువ దూరం కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. బెంగళూరుతోపాటు పాండిచ్చేరిలో కూడా నాకు ఓ ఇల్లు ఉండాలని కోరిక. అక్కడ సువాసన కలిగిన చెట్ల నీడలో సేద తీరడం బావుంటుంది. అసలు సిసలు ప్రకృతి నాకు సరైన విశ్రాంతిని ఇస్తుంది. అన్నట్టు.. హైదరాబాద్ కూడా నా జబితాలో ఉందండోయ్’ అని చెప్పి ముగించారు.
This website uses cookies.