రియల్ రంగంలో జోరుగా దూసుకెళ్తున్న హైదరాబాద్ లో రాబోయే రెండు మూడేళ్లలో 35 నుంచి 38 మిలియన్ చదరపు అడుగులు హై క్వాలిటీ బిజినెస్ పార్కులు రానున్నాయని సీబీఆర్ఈ దక్షిణాసియా నివేదిక వెల్లడించింది. ఇటీవల కాలంలో ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిన నేపథ్యంలో పలు గ్లోబల్ కార్పొరేషన్లు హైదరాబాద్ లో ప్రవేశించాయి. దీంతో కార్యాలయ స్థలాల కోసం డిమాండ్ పెరిగింది. ఫలితంగా 2019 నుంచి ఆఫీస్ స్పేస్ డిమాండ్ గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
2022లో గ్రేడ్ ఆఫీస్ స్టాక్ 100 మిలియన్ చదరపు అడుగులను అధిగమించింది. 2019లో ఇది 73 మిలియన్ చదరపు అడుగులు ఉంది. ఇక ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి 119 మిలియన్ చదరపు అడుగులు దాటింది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ఆఫీస్ లీజు కార్యకలాపాల్లో 6.6 మిలియన్ చదరపు అడుగులతో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆఫీస్ స్పేస్ డిమాండ్ కు తగినట్టుగా రాబోయే రెండు మూడేళ్లలో 38 మిలియన్ చదరపు అడుగుల బిజినెస్ పార్కులు ఏర్పాటు కానున్నాయని అంచనా వేస్తున్నారు. అలాగే రాబోయే రెండు లేదా మూడేళ్లలో హైదరాబాద్ లో 1.30 లక్షల రెసిడెన్షియల్ యూనిట్లు ప్రారంభించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. వెస్ట్ హైదరాబాద్ ప్రధానంగా మిడ్ సెగ్మెంట్, హై ఎండ్, ప్రీమియం కేటగిరీలతో అందరినీ ఆకర్షించే రెసిడెన్షియల్ హబ్ గా తన హోదాను కొనసాగిస్తుందని తెలిపింది. దీనికి విరుద్ధంగా ఉత్తర, తూర్పు, దక్షిణ హైదరాబాద్ లోని మైక్రో మార్కెట్లు మిడ్ సెగ్మెంట్ ఇళ్ల
This website uses cookies.