poulomi avante poulomi avante

హైదరాబాద్ హైరైజ్

హైదరాబాద్లో బహుళ అంతస్తుల భవనాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు చేరువలో ఈ ప్రాజెక్టుల్ని పలువురు డెవలపర్లు నిర్మిస్తున్నారు. ఖరీదైన ఫ్లాట్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అధిక శాతం బిల్డర్లు వీటిని చేపడుతున్నారు. కరోనాతో సంబంధం లేకుండా కొనుగోలుదారులు ఫ్లాట్లను కొనుగోలు చేస్తుండటం ప్రస్తుతం వీరికి కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు.
దేశంలోని అన్ని నగరాల్ని క్షుణ్నంగా గమనిస్తే.. నగరంలోనే రియల్ రంగం త్వరగా కోలుకుంది. గత ప్రాపర్టీ షోకు విచ్చేసిన కొనుగోలుదారులే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఆ కార్యక్రమంలో ప్రాజెక్టుల్ని చూసిన కొనుగోలుదారులు పూర్తి వివరాల్ని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. మరి, ప్రస్తుతం భాగ్యనగరంలో వివిధ ప్రాంతాల్లో కడుతున్న పలు బహుళ అంతస్తుల ప్రాజెక్టుల వివరాల్ని చూద్దామా..

ప్రాజెక్టు పేరు: సైబర్ సిటీ ఒరియానా
ఎక్కడ? ఐడీఎల్ రోడ్డు, కూకట్ పల్లి
విస్తీర్ణం, సంఖ్య: 7 ఎకరాలు, 582 ఫ్లాట్లు
ఎత్తు? జి ప్లస్ 27 అంతస్తులు
2, 3 పడక గదులు- 1250 నుంచి 2380 చ.అ.
పూర్తి? 2025 డిసెంబరు

ఒకే ఆవరణలో దాదాపు నాలుగు వేలకు పైగా ఫ్లాట్లను నిర్మించిన సైబర్ సిటీ డెవలపర్స్.. దాని పక్కనే సైబర్ సిటీ ఒరియానా అనే ప్రాజెక్టును ప్రారంభించింది. దాదాపు ఏడు ఎకరాల్లో 582 ఫ్లాట్లను నిర్మిస్తోంది. రెరా అనుమతి గల ఈ ప్రాజెక్టును జి ప్లస్ 27 అంతస్తుల్లో చేపడుతోంది. ఇందులో 2, 3 పడక గదుల ఫ్లాట్లకు పెద్దపీట వేసింది. 2025 డిసెంబరులో పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

శ్రీముఖ్ నమితా 360 లైఫ్
ఇజ్జత్ నగర్ (కొండాపూర్ చేరువలో)
3 ఎకరాలు, 288 యూనిట్లు
30 అంతస్తులు
2427- 4850 చ.అ.
2025 మే
కొండాపూర్ చేరువలోని ఇజ్జత్ నగర్లో శ్రీముఖ నమితా 360 లైఫ్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. 30 అంతస్తుల ఎత్తులో వర్టికల్ ఫారెస్టును నిర్మిస్తున్నామని సంస్థ చెబుతోంది. ప్రపంచస్థాయి ఆర్కిటెక్చర్, ఆలోచనాత్మకమైన డిజైన్ల కలబోతగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు హైదరాబాద్లోనే వినూత్న కట్టడంగా ఖ్యాతినార్జిస్తుందని అంటోంది. ముప్పయ్ అంతస్తుల ఒక టవర్లో దాదాపు 288 ఫ్లాట్లు వస్తాయి. హైటెక్స్ కు కూతవేటు దూరంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

జయభేరి ద సమ్మిట్
నార్సింగి
4.5 ఎకరాలు, 450 యూనిట్లు
30 అంతస్తులు
1860 – 2075 చ.అ.
గృహ‌ప్ర‌వేశానికి సిద్ధం
హైదరాబాద్ నిర్మాణ రంగంలో నాణ్యతకు మారుపేరుగా నిలిచే జయభేరి సంస్థ నార్సింగిలో ద సమ్మిట్ అనే 30 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని నిర్మించింది. ఇందులో సుమారు 450 ఫ్లాట్లను నిర్మించింది. ఇందులో ఫ్లాట్ ధర.. రూ.1.66 కోట్ల నుంచి ఆరంభమవుతుంది. ఇందులోని రిసెప్షన్ ఏరియా, మెరిసే లాబీలు, హై స్పీడ్ లిఫ్టులు, డబుల్ హైట్ బాల్కనీలు వంటివి ఫైవ్ స్టార్ హోటల్ ను తలపిస్తాయి. 45 వేల చదరపు అడుగుల్లో నిర్మించే నాలుగు అంతస్తుల క్లబ్ హౌజ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రాజెక్టుకు ఐజీబీసీ గోల్డ్ సర్టిఫికెట్ కూడా లభించింది.

 హాల్ మార్క్ ట్రెజర్
కోకాపేట్
4.62 ఎకరాలు, 526 ఫ్లాట్లు
29 అంతస్తులు
1,695 – 5,080
2024 నవంబరు
హాల్ మార్క్ బిల్డర్స్ కోకాపేట్లో హాల్ మార్క్ ట్రెజర్ అనే ప్రాజెక్టుకు రెరా అనుమతి లభించింది. సుమారు 4.62 ఎకరాల్లో 526 ఫ్లాట్లను ఈ సంస్థ నిర్మిస్తోంది. ఒక్కో టవర్ 29 అంతస్తుల్లో నిర్మించే ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ల విస్తీర్ణం 1695 నుంచి ఆరంభమవుతుంది. గరిష్ఠ విస్తీర్ణం 5080 చదరపు అడుగులు కావడం విశేషం. నిర్మాణ పనులూ ప్రారంభం కాగా 2024 నవంబరులో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇండిస్ వివా సిటీ
కొండాపూర్
8.15 ఎకరాలు, 1000 యూనిట్లు
జి ప్లస్ 22 అంతస్తులు
1475- 2595 చ.అ.
2023 జూన్
హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఇండిస్ గ్రూపు ప్రత్యేకతను చాటి చెబుతోంది. దాదాపు దశాబ్దం క్రితం పీబీఈఎల్ సిటీని ఆరంభించిన ఈ సంస్థ.. బొల్లారంలో వీబీ సిటీ, మాదాపూర్ చేరువలో వన్ సిటీ వంటివి చేపడుతోంది. తాజాగా, కొండాపూర్లో వివా సిటీని ఆరంభించింది. జి ప్లస్ 22 అంతస్తుల ఎత్తులో సుమారు వెయ్యి ఫ్లాట్లను నిర్మిస్తోంది. చిరెక్ స్కూల్ చేరువలో నిర్మితమవుతోన్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి దాదాపు నాలుగు టవర్లు కాగా నిర్మాణాన్ని 2023 జూన్ లోపు కొనుగోలుదారులకు అందజేయడానికి శరవేగంగా నిర్మాణ పనుల్ని జరుపుతోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles