Categories: PROJECT ANALYSIS

తెల్లాపూర్‌లో.. ముప్పా మెలోడీ

తెల్లాపూర్‌లో ముప్పా ప్రాజెక్ట్స్‌ ( Muppas Melody in Tellapur ) .. ముప్పా మెలోడీ అనే ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్రాజెక్టును ఆరంభించింది. సుమారు ఎనిమిది ఎక‌రాల్లో ఏడు ట‌వ‌ర్ల‌ను క‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించింది. ఇందులో మొత్తం వ‌చ్చే ఫ్లాట్ల సంఖ్య‌.. దాదాపు 1054 ఫ్లాట్లు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. 75 శాతం ఖాళీ స్థ‌లంగా వ‌దిలేస్తారు. అంటే, నిర్మాణం వ‌చ్చేది పాతిక శాతం స్థ‌లంలోనే. ఫ్లాట్ల సైజు విష‌యానికి వ‌స్తే.. 1010, 1400, 1655, 1725 చ‌ద‌ర‌పు అడుగుల సైజుల్లో నిర్మిస్తోంది. అల్యూమినియం ఫోమ్ వ‌ర్క్ విధానంలో క‌ట్టే ఈ ప్రాజెక్టులో రెండు క్ల‌బ్ హౌజుల‌కు స్థానం క‌ల్పించారు. వీటి విస్తీర్ణం ఎంత‌లేద‌న్నా 42 వేల చ‌ద‌ర‌పు అడుగుల దాకా ఉంటుంది. ఈ ప్రాజెక్టును 2023 జులైలో అప్ప‌గించేందుకు సంస్థ ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించింది. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.5200- 5695 చెబుతున్నారు.

ఔట‌ర్ రింగ్ రోడ్డు రీజియ‌న్‌లో ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, కొల్లూరు చేరువ‌లో తెల్లాపూర్ ఉంది. ఇక్క‌డ్నుంచి గ‌చ్చిబౌలికి సులువుగా రాక‌పోక‌ల్ని సాగించొచ్చు. ఇక్క‌డ చుట్టుప‌క్క‌ల దాదాపు 25 ప్రాజెక్టుల‌కు పైగా ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్నాయి.

This website uses cookies.