వ్యర్థాల సేకరణలో మనమేదో ఘనత సాధించామని.. ఘన వ్యర్థాల నిర్వహణలో మనం దూసుకెళుతున్నామని పొంగిపోవాల్సిన అవసరమే లేదు. మనతర్వాత ఆరంభమైన చెన్నైలో ఈ కార్యక్రమం ఎంతో పకడ్బందీగా జరుగుతోంది. అక్కడైతే సేకరించేటప్పుడే.. తడి చెత్త, పొడిచెత్తను విడివిడిగా సేకరిస్తున్నారు. కానీ, మన వద్ద జరుగుతున్నదేమిటి? జీహెచ్ఎంసీ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు చెత్తను తీసుకుని.. రెండింటిని కలుపుకుని తీసుకెళుతున్నారు. ఏదో మొక్కుబడిగా రెండు డబ్బాలిచ్చి.. వాటిలో విడివిడిగా చెత్తను వేయాలని చెప్పారు. తొలి రోజుల్లో ప్రజలు ఈ సూచనని పాటించారు. కానీ, వ్యర్థాల సేకరించే వ్యక్తి.. ఆ రెండింటినీ ఓకే దాంట్లో తీసుకు పోవడాన్ని చూసి చెత్తను వేరు చేయడం మానివేశారు.
ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం.. ఓ స్పానిష్ సంస్థకు అప్పగించింది. ఆతర్వాత అక్కడి పరిస్థితిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు. సేకరణ కోసం మూడు వేల ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలను వినియోగిస్తున్నారు. దీని వల్ల ఎంతో ఇంధనం ఆదా అయ్యింది. రోడ్డు మీద వాహన కాలుష్యం తగ్గింది. మరి, మన దగ్గర ఇప్పటికీ డొక్కు బండ్లనే వాడుతున్నారు. అవేమో రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారేస్తూ వెళ్లడాన్ని మనం ఎన్నోసార్లు చూశాం. కానీ, చెన్నైలో ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. వ్యర్థాల నిర్వహణలో స్పానిష్ సంస్థ ఏం చేస్తుందంటే..
This website uses cookies.