Categories: LATEST UPDATES

ఇక ఆన్ లైన్ లోనే మ్యుటేషన్

ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియను మాన్యువల్ పద్ధతిలో చేసే విధానానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) స్వస్తి పలికింది. ఇకపై మ్యుటేషన్ మొత్తం ఆన్ లైన్ లోనే చేయనుంది. ‘మరింత పారదర్శకత, జవాబుదారీతనం కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా విధానంలో భాగంగా సర్టిఫికెట్లలో పేరు మార్పు, మాన్యువల్ కరస్పాండెన్స్ లను నిలిపివేయాలని ఎంసీడీ నిర్ణయం తీసుకుంది’ అని ఓ ప్రకటనలో తెలిపింది.

ఎంసీడీ వెబ్ సైట్ నుంచి క్యూఆర్ కోడ్ ఉన్న సర్టిఫికెట్ ను ప్రజలు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించింది. అలాగే 2019 మార్చి 31 కంటే ముందు నమోదైన వాటికి మాత్రమే ఈ-మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆస్తిపన్ను రిమైండర్ నోటీసులను కూడా ఆన్ లైన్ లోనే పంపే ప్రక్రియకు త్వరలోనే శ్రీకారం చుడతామని తెలిపింది. ‘ప్రస్తుతం ఆస్తి పన్ను నోటీసును మాన్యువల్ పద్ధతిలో అందజేస్తున్నాం. త్వరలోనే దీనిని కూడా ఆన్ లైన్ చేస్తాం’ అని ఎంసీడీ అధికారి తెలిపారు. ఇకపై పేపర్ వర్క్ అనేది లేకుండా అంతా ఆన్ లైన్ చేస్తామని, ఫలితంగా ప్రజలు ఫైళ్లు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని వివరించారు.

This website uses cookies.