జీవితంలో సొంతంగా ఆస్తి ఉండాలని చాలామంది కలలు కంటారన్న సంగతి తెలిసిందే. కానీ, ప్రముఖ టాలీవుడ్ గాయకుడు శ్రీరామ్ చంద్రకు మాత్రం జీవితమంటే కేవలం బ్యాలెన్స్ చేసుకోవడం మాత్రమే. ఎందుకంటే తను ఖర్చులను సమతుల్యం చేసుకున్నారు. తన కలలను సాకారం చేసుకోవడానికి.. తొలి రోజుల్లో హైదరాబాద్ నుంచి ముంబైకి రాకపోకల్ని సాగించడానికి అనేక కష్టాల్ని అనుభవించాడు. అంతేకాదు, మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని రియల్ ఎస్టేట్ గురుతో ఆయన ప్రత్యేకంగా పంచుకున్నారు.
నేను హైదరాబాద్‌లో పెరిగాను. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఇక్కడే ఎక్కువ కాలం నివసించాలని అనుకున్నాను. ఇక్కడే కెరీర్ బిల్డ్ చేసుకోవాలని అనుకున్నాను. కాకపోతే, ఇండియన్ ఐడల్ తర్వాత జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకునేందుకు ముంబైకి షిఫ్ట్ అయ్యాను. నాలాంటి సంగీతకారుల కోసం 2011 నుంచి 2020 వరకూ స్వర్ణయుగం అని చెప్పొచ్చు. తెలుగులో బిగ్ బాస్ తర్వాత నా సొంత నగరంపై మమకారం మరింత ఎక్కువ పెరిగింది. ఇక్కడ్నుంచే బడా స్టార్లంతా పని చేయడం ఆరంభించారు. హైదరాబాద్‌లో అయితే మా ఇల్లు మరింత పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే ఎప్పుడంటే అప్పుడు హ్యాపీగా కారు వేసుకుని వెళ్లొచ్చు. ముంబై మాత్రం నిద్రపోదు. మీరేం చేస్తున్నారో ఎవరూ బాధపడరు.
స్టార్ అయిన తర్వాత వచ్చిన మార్పులేమిటనే అంశాన్ని గమనిస్తే.. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగే ఇంట్లో నివసించాను. కనీసం ఏసీ కూడా పెట్టుకోలేని పరిస్థితి. ప్రస్తుతం అవన్నీ నాకు కావాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు అన్ని అధునాతన పరికరాలతో నా స్వంత స్టూడియోని నిర్మించాను! ప్రస్తుతం ఖరీదైన హోటళ్లలో నివసిస్తున్నాను. ఈ లోకంలో ఉన్న డబ్బంతా నా వద్దే ఉంటే ఏం చేస్తానే అంశానికి వస్తే.. నాకు విలాసవంతమైన ఆస్తి మీద ఆసక్తి లేదు. దానికి బదులుగా ఆనందంగా జీవించేందుకు సరైన భాగస్వామి కావాలి. నా జీవితంలో నన్ను నిజంగా ప్రేమించే సరైన వ్యక్తితో సింగిల్ బెడ్రూమును కొనడమూ నాకు ఇష్టమే. ముంబైలో ఉన్నప్పుడు చాలాకాలం ఒంటరిగా ఉన్నాను. ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. నా చుట్టూ ఉన్నవారు విధేయతతో ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. తీరిక వేళల్లో ఎక్కడ ఉంటానంటే.. వర్కవుట్లు చేస్తాను. రికార్డింగులు చేసుకుంటాను. అతిగా చూడటం ఇష్టపడతాను. బయటికి తిరగడాన్ని ఎక్కువగా ఇష్టపడను.
This website uses cookies.