poulomi avante poulomi avante

మై హోమ్ @ 35 ఏళ్లు

నిర్మాణ‌ రంగంలోకి ప్ర‌వేశించి 35 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా మై హోమ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ స‌రికొత్త ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఏడాది చివ‌రిలోపు మూడున్న‌ర కోట్ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని అంద‌జేస్తున్నామ‌ని వెల్ల‌డించింది. ఇప్ప‌టికే 2.7 కోట్ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కూ అంద‌జేశామ‌ని, మ‌రో ఎన‌భై ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం నిర్మాణ ద‌శ‌లో ఉంద‌ని ప్ర‌క‌టించింది.

ప్ర‌పంచ స్థాయి స‌దుపాయాల్ని న‌గ‌ర వాసుల‌కు అందించాల‌న్న ఉన్న‌తమైన ల‌క్ష్యంతో మైహోమ్ సంస్థ ప్ర‌స్థానం ముప్ప‌య్ ఐదేళ్ల క్రితం మొద‌లైంద‌ని సంస్థ వోల్ టైమ్ డైరెక్ట‌ర్ జూప‌ల్లి రాము రావు అన్నారు. హైద‌రాబాద్ నిర్మాణ రంగానికి స్విమ్మింగ్ పూల్‌తో పాటు టెర్ర‌స్ గార్డెన్ కాన్సెప్టును ప‌రిచ‌యం చేసింది తామేన‌ని స‌గ‌ర్వంగా తెలిపారు. 1998లో మైహోమ్ ఫెర్న్‌హిల్ ప్రాజెక్టే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. క్ల‌బ్ హౌజ్‌, బ‌ల్క్ మున్సిప‌ల్ క‌నెక్ష‌న్‌, జాగింగ్ ట్రాక్ వంటివి 2005లో మై హోమ్ నవ‌ద్వీప‌లో ప్ర‌వేశ‌పెట్టామ‌ని చెప్పారు. ప్రీ పెయిడ్ ఎల‌క్ట్రీక‌ల్‌, గ్యాస్‌, మెయింట‌నెన్స్‌, ఇంటింటికి ఫైబ‌ర్ క‌నెక్ష‌న్ వంటివి 2000 ఫ్లాట్ల గేటెడ్ క‌మ్యూనిటికీ అందించిన ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌ని వివ‌రించారు. వాణిజ్య ప్రాజెక్టుల్లో స‌రికొత్త ప‌రిజ్ఞానాన్ని ప్ర‌వేశ‌పెట్టామ‌ని, సెంట్ర‌ల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్ట‌మ్ వంటివి ఇందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నారు.

10 వేల కుటుంబాలకు..

సంస్థ ఎండీ శ్యామ్ రావు జూప‌ల్లి మాట్లాడుతూ.. కొనుగోలుదారుల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్టుగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ప్రాజెక్టుల్ని తీర్చిదిద్దుతామ‌న్నారు. ఈ క్ర‌మంలో వారి ఆలోచ‌న‌ల్ని, అభిప్రాయాల్ని నిత్యం తెలుసుకుంటామ‌న్నారు. కొవిడ్ నేప‌థ్యంలో కొనుగోలుదారుల‌కు త్రీడీ హోమ్ విజువ‌లైజేష‌న్ విధానాన్ని తెల్లాపూర్‌లో నిర్మిస్తున్న మై హోమ్ త్రిదాసా ప్రాజెక్టులో ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు. ఈ సౌక‌ర్యాన్ని అన్ని ప్రాజెక్టుల‌కు వ‌ర్తింప‌జేస్తామ‌ని తెలిపారు.

ప్ర‌జ‌ల‌కు మెరుగైన జీవ‌న విధానాన్ని అందించాల‌న్న ఉన్న‌త‌మైన ల‌క్ష్యంతో మై హోమ్ సంస్థ‌ను 35 ఏళ్ల క్రితం ప్రారంభించామ‌ని సంస్థ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు తెలిపారు. మా విలువ‌లకు, క‌ష్టానికి, నిబద్ధ‌త‌కు ఇన్ని సంవ‌త్స‌రాల మా ప్ర‌యాణ‌మే చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు 10 వేల మంది కుటుంబాలకు స్థిర నివాసాన్ని అందించామ‌ని, తాము నిర్మించిన ఆఫీసు స‌ముదాయాల్లో యాభై వేల‌కు పైగా ఉద్యోగులు ప‌ని చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. కోకాపేట్లో 2.7 కోట్ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లంలో ఆఫీసు స‌ముదాయాన్ని నిర్మిస్తున్నామ‌ని, తెల్లాపూర్లో మై హోమ్ అంకురా, మై హోమ్ త్రిదాసా వంటి ప్రాజెక్టుల్ని ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles