Categories: Celebrity Homes

జూబ్లీహిల్స్ లో నాగచైతన్య కొత్త ఇల్లు?

ప్రముఖ నటుడు నాగచైతన్య హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ.15 కోట్లు వెచ్చించి కొత్త ఇంటిని కొన్నట్టు సమాచారం. నటి సమంతతో విడిపోయిన మూడేళ్ల తర్వాత నాగ చైతన్య ఈ ఇంట్లోకి మారినట్టు సమాచారం. అయితే, ఈ కొనుగోలుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. సమంతను వివాహం చేసుకున్న తర్వాత ఇరువురూ జూబ్లీహిల్స్ లో నివసించేవారు.

అయితే, ఇద్ద‌రి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా 2021లో విడిపోయారు. అప్పటి నుంచి నాగచైతన్య హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఉంటున్నారని.. సమంత హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో నాగ చైతన్య రూ.15 కోట్లు వెచ్చించి కొత్త ఇల్లు కొన్నట్టు తెలుస్తోంది. కాగా, నాగచైతన్య చివరిసారిగా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించాడు. అయితే, ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమా మే 12న విడుదల కానుంది.

 

This website uses cookies.