Categories: LATEST UPDATES

వాణిజ్య భూస్వాములకు చక్కని అవకాశం..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ పని విధానం పెరుగుతోంది. ఇది స్థానికంగా ఫ్లెక్స్ స్పేసెస్, కార్యాలయ అనుభవం కలిగించే స్థలాల వృద్ధికి దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో వాణిజ్య భూస్వాములు మెరుగైన ప్రయోజనాలు పొందేలా తమ ఆస్తుల విషయంలో వ్యవహరించే వెసులు బాటు కలిగింది. హైబ్రిడ్ పని విధానం బాగా పెరుగుతున్నందున కోట్లాది మందికి పని జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఈ నేపథ్యంలో వాణిజ్య భూస్వాములు, ఇతర పెట్టుబడిదారులు తమ క్లయింట్ల అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ఆస్తులను రూపొందించడం ద్వారా కొత్త పని ప్రపంచంలో విజయం వైపు దూసుకెళ్లొచ్చు.

కార్యాలయాన్నీ తమ నిర్వహణ ఖర్చును తగ్గించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. హైబ్రిడ్ పని విధానం అంటే ఉద్యోగులందరికీ ఒకే సమయంలో వసతి కల్పించాల్సిన అవసరం లేదు. అందువల్ల కంపెనీలు తమ ఆఫీసు సైజు తగ్గించుకుంటాయి. తద్వారా అద్దె, సంబంధిత నిర్వహణ వ్యయం తగ్గుతుంది. గ్లోబల్ వర్క్ ప్లేస్ అనలటిక్స్ ప్రకారం.. హైబ్రిడ్ విధానంలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా యజమానులు ఏడాదికి 11వేల డాలర్లు ఆదా చేయొచ్చు. ఇలా ఆదా చేసిన సొమ్మును వ్యాపారంలో మళ్లీ పెట్టుబడిగా పెట్టి వృద్ధి పొందవచ్చు. ఉద్యోగులు, శ్రామికులు వారు నివసించే ప్రదేశానికి దగ్గర్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నందున సబర్బన్లలో కొత్త ధోరణి ఉద్భవిస్తోంది. ‘గ్రామీణ, సబర్బన్ ప్రాంతాల్లో వందలాది వర్కింగ్ లొకేషన్లు తెరిచే అవకాశాలు ఉన్నందున అనేక రకాల శక్తివంతమైన కమ్యూనిటీలు తమ వ్యాపారంతో బాగా అభివృద్ధి చెందుతాయి’ అని ఐడబ్ల్యూజీ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ డిక్సన్ పేర్కొన్నారు.

హైబ్రిడ్ విధానం అందరికీ ప్రయోజకరంగా ఉంటుందని చెబుతున్నారు. పనికి, జీవితానికి సరైన సమతుల్యత ఉండటంతో పాటు తమకు నచ్చిన విధంగా పనిచేసే వెసులుబాటు ఉద్యోగులకు కలుగుతుంది. శ్రామిక శక్తి వ్యాప్తికి ఊతమిస్తుంది. ఇలాంటి వర్క్ ఫోర్స్ కోసం కొత్త పని ప్రదేశాలను అందించేందుకు భూస్వాములకు కొత్త అవకాశాలు కల్పిస్తుంది

This website uses cookies.