Categories: LATEST UPDATES

కొత్త భవనంలోకి.. యూఎస్ కాన్సులేట్

  • 20 నుంచి నానక్ రాంగూడ
    ఆఫీసులో కార్యకలాపాలు ప్రారంభం

అమెరికా కాన్సులేట్ కార్యాలయం నానక్ రాంగూడలోని కొత్త భవనంలోకి మారుతోంది. ఈనెల 20న కొత్త భవనం ప్రారంభం కానుంది. రూ.27.87 కోట్ల వ్యయంతో ఈ అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం బేగంపేట పైగా ప్యాలెస్ లో యూఎస్ కాన్సులేట్ కొనసాగుతోంది. ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్కడ కార్యకలాపాలు నిలిపివేస్తారు. అప్పటి నుంచి 20వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు కాన్సులేట్ మూసి ఉంటుంది. 20న ఉదయం 8.30 గంటలకు అధికారికంగా నూతన భవనం నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అత్యవసర సేవలు కోరే అమెరికా పౌరులు మార్చి 20న ఉదయం 8.30 గంటల వరకు +91 040-4033 8300 నెంబర్ లో సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ సూచించింది. మార్చి 20వ తేదీ ఉదయం 8.30 గంటల తర్వాత అత్యవసర సేవలు కోరే అమెరికా పౌరులు +91 040 6932 8000 పై సంప్రదించాలని పేర్కొంది. అత్యవసరం కాని సందేహాల కోసం అమెరికా పౌరులు HydACS@state.gov కి ఈ మెయిల్ చేయాల్సి ఉంటుంది.

బయోమెట్రిక్ అపాయింట్ మెంట్స్, డ్రాప్ బాక్స్ అపాయింట్ మెంట్స్, పాస్ పోర్టు పికప్ సహా ఇతర వీసా సేవలు లోయర్ కోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్ లోని వీసా అప్లికేషన్ సెంటర్ లో కొనసాగుతాయని తెలిపింది. కాన్సులేట్ మార్పు వల్ల వీసా సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. వీసా సేవలకు సంబంధించిన సందేహాలకు +91 120 4844644 లేదా +91 22 62011000 పై కాల్ చేయాలని సూచించింది.

This website uses cookies.