Categories: TOP STORIES

2023లో రియాల్టీ.. రూ.13 లక్షల కోట్లు!

కరోనా మహమ్మారి తదనంతర పరిణామాలు, భౌగోళిక అస్థిక పరిస్థితులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు 2022లో ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపించాయి. ఈ ఏడాది కూడా భారత ఆర్థిక వ్యవస్థకు రికవరీ కాలంగానే పరిగణించవచ్చు. పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, ఆదాయాల్లో పెరుగుదల వంటి అంశాలతో పాటు రియల్ రంగం గాడిన పడటం వంటివి మార్కెట్ స్థిరంగా ఉండటానికి కారణాలు.

2023 నాటికి భారత రియల్ రంగం రూ.13 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. లగ్జరీ ప్రాపర్టీల్లో అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు పెట్టుబడులు పెట్టడం, తొలిసారి ఇల్లు కొనేవారి సంఖ్య పెరుగుతుండటంతో భారత రియల్ రంగం దూకుడుగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రియల్ రంగం బాగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సరసమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు.

అలాగే స్మార్ట్ హోమ్స్ లో గణనీయమైన వృద్ధి కొనసాగుతుందని విశ్లేషిస్తున్నారు. హరిత భవనాల సంఖ్య కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పర్యావరణ హితమైన ఇళ్లకు దేశంలో డిమాండ్ పెరుగుతుందని, నిర్మాణ రంగంలో కూడా గ్రీన్ బిల్డింగ్ ప్రాక్టీసెస్, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ వాడకం ఎక్కువవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కో లివింగ్, షేర్డ్ హౌసింగ్ వంటివి మరింత ప్రాచుర్యంలోకి వస్తాయంటున్నారు. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ తో పాటు విద్యార్థులు దీని వైపు మొగ్గు చూపుతారని చెబుతున్నారు. ఇక నగరాల్లో ట్రాఫిక్ పెరగడం, ఇరుకైన వీధులు ఉండటం వంటి కారణాలతో చాలామంది సబర్బన్ ప్రాంతాల వైపు దృష్టి సారిస్తారు.

This website uses cookies.