Categories: TOP STORIES

కొత్త టైటిల్ బీమా పాలసీలో ఏముంది?

మనం కోలుకోలేని నష్టాలను నివారించి అండగా ఉండేది బీమా మాత్రమే. కనీస మొత్తం ప్రీమియం చెల్లించడం ద్వారా మన జీవితం దగ్గర నుంచి విలువైన ఉత్పత్తుల వరకు బీమా రక్షణ పొందొచ్చు. ఆస్తికి సంబంధించిన యాజమాన్య సమస్యలు, భూమి హక్కుల్లోని లోపాలు, టైటిల్ బదిలీ తదితర విషయాలకూ బీమా రక్షణ పొందొచ్చనే సంగతి మీకు తెలుసా?

ప్రమోటర్లు, డెవలపర్లు, రిటైల్ ప్రాపర్టీ కొనుగోలుదారుల కోసం కొత్త టైటిల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు ప్రారంభించాలని ఇటీవల ఐఆర్డీఏఐ సాధారణ బీమా కంపెనీలను కోరింది. ఎవరికైనా సొంతిల్లు అనేది ఓ కల. దానిని నెరవేర్చుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో యాజమాన్య సమస్యల కారణంగా తలెత్తే ఏదైనా ఆర్థిక నష్టం నుంచి రక్షించుకోవడానికి కొత్త టైటిల్ ఇన్సూరెన్స్ అక్కరకొస్తుంది. రిటైల్ కొనుగోలుదారులకు రక్షణ కల్పించేందుకు అన్ని ప్రాజెక్టులకు, ప్రతి డెవలపర్ కు టైటిల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అని రెరా స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండు రకాల టైటిల్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి.

ప్రమోటర్ లీగల్ ఖర్చులు (డిఫెన్స్ వ్యయం) పాలసీ:

ఓ ప్రాజెక్టు యాజమాన్య హక్కులు సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై చట్టపరమైన డిఫెన్స్ వ్యయాన్ని మాత్రమే ఇది కవర్ చేస్తుంది.

అలాటీ లేదా వ్యక్తిగత కొనుగోలుదారు రిటైల్ పాలసీ:

ఆస్తి యాజమాన్య హక్కుల్లో లోపాల కారణంగా ఏర్పడిన నష్టాలను ఇది కవర్ చేస్తుంది. ఆస్తిని స్వాధీనం చేసే సమయంలో వ్యక్తిగత కొనుగోలుదారు లేదా ఫైనాన్షియర్ ఈ పాలసీని ఎంచుకోవచ్చు.

కొత్త బీమా కవర్ ఎలా?

టైటిల్ అనేది ఆస్తి యొక్క చట్టపరమైన యాజమాన్యం. ఇది చట్టపరమైన యజమానిని, అతడు లేదా ఆమె ఆస్తిని ఏదైనా ఆర్థిక నష్టం నుంచి రక్షించే ప్రత్యేక బీమా పాలసీ ఇది. టైటిల్స్ అన్నీ సరైనవి కానందున.. మీరు టైటిల్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం దరఖాస్తు చేసినప్పుడు.. పాలసీని జారీ చేసే ముందు బీమా కంపెనీ టైటిల్ సరైనదో కాదో క్షుణ్నంగా పరిశీలిస్తుంది. దానికి సంబంధించి ఎలాంటి వివాదాలు, పెండింగ్ పన్నులు, చట్టబద్ధమైన వివాదాలు, బయటకు వెల్లడించిన వారసుల వంటివి ఏమీ లేవని ధ్రువీకరించిన తర్వాత మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ జారీ చేస్తుంది. ఆ తర్వాత ఎవరైనా సదరు ఆస్తి యాజమాన్య హక్కులను సవాల్ చేస్తే.. తద్వారా వచ్చే నష్టాన్ని బీమా కంపెనీ మీకు చెల్లిస్తుంది.

టైటిల్ ఇన్సూరెన్స్ వల్ల లాభాలివీ..

  • రెరా చట్టం యొక్క చట్టబద్ధమైన సమ్మతి కలిగి ఉంటుంది.
  • టైటిల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వల్ల సదరు ఆస్తిని తనఖా పెట్టినప్పుడు దాని విలువ పెరుగుతుంది. అంతే కాకుండా రుణగ్రహీతలకు తనఖా రుణాలను పొందడాన్ని సులభతరం చేస్తుంది.
  • లీగల్ పరమైన అన్ని ఖర్చులను అందిస్తుంది.
  • ఆస్తి రికార్డులను ట్రాక్ చేయడానికి వ్యవస్థీకృత వ్యవస్థ లేనందున ఇది చాలా అవసరం.
  • సాధారణ బీమా కంపెనీలు క్లెయిమ్ సెటిల్ మెంట్ లో న్యాయ సహాయం అందిస్తాయి కాబట్టి మీకు గణనీయమైన మొత్తంలో డబ్బుతో పాటు బోలెడు సమయం ఆదా అవుతుంది.
  • టైటిల్ ఇన్సూరెన్స్ ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేయడం సురక్షితమని కొనుగోలుదారుల భావిస్తారు కాబట్టి, ఇది ఆస్తి విలువను పెంచుతుంది.
  • టిల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ రికార్డులు, సర్వేల్లోని లోపాలను కూడా కవర్ చేస్తుంది.

టైటిల్ ఇన్సూరెన్స్ జారీలో సవాళ్లు

టైటిల్ ఇన్సూరెన్స్ అనేది మన దేశంలో సాధారణ పద్ధతి కాదు. ఎందుకంటే దీనిని అందించడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో టైటిల్ ఇన్సూరెన్స్ జారీ చేసే క్రమంలో బీమా కంపెనీలు పలు సవాళ్లను ఎదుర్కొంటాయి. అవేంటంటే..

  • భారతదేశంలో టైటిల్ సంబంధిత మోసాల సంఖ్య చాలా ఎక్కువ.
  • టైటిల్ వివాదాల పరిష్కార వ్యవస్థ చాలా నెమ్మదిగా సాగుతోంది.
  • పాలసీ జారీ చేసే ముందు ఆస్తిపై తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అయ్యే చాలా ఎక్కువగా ఉంటాయి.
  • ఇన్ స్పెక్షన్ ప్రక్రియ చాలా సుదీర్ఘమైంది. చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే బీమా కంపెనీ తగిన ల్యాండ్ రిజిస్ట్రీల్లో సోదాలు నిర్వహించాలి. ఆస్తి రికార్డుల విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించాలి.
  • ఆస్తిపై తలెత్తే వ్యాజ్యాలకు సంబంధించి చట్టాలలో చాలా లొసుగులు ఉన్నాయి. అవి అనిశ్చితికి దారి తీస్తాయి.

ప్రాపర్టీని మరొకరికి బదిలీ చేసే ప్రతిసారీ టైటిల్ మారుతుంది. అందువల్ల బదిలీ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టైటిల్ ఇన్సూరెన్స్ అనేది యాజమాన్య సమస్యలను పరిష్కరించడానికి సాయపడుతుంది. ప్రమోటర్లు లేదా డెవలపర్లు, వ్యక్తిగత కొనుగోలుదారులకు టైటిల్ లోపాల కారణంగా సంభవించే ఆర్థిక నష్టాల నుంచి రక్షిస్తుంది. అందువల్ల దీన్ని కొనుగోలు చేయడం మంచిదే.

This website uses cookies.