Categories: TOP STORIES

న‌గ‌రానికి ద‌గ్గ‌ర్లో నేచ‌ర్ హోమ్స్‌

  • ట్రాఫిక్… పొల్యూషన్… బిజీ బిజీ…
  • నగర జీవితంలో వీటిని తప్పించుకోవడం అసాధ్యం!

ఉద్యోగం, వ్యాపారం, చదువులు… ఇవన్నీ సిటీతో ముడిపడి ఉంటాయి కాబట్టి, ఈ గందరగోళాన్ని ఎలాగూ తప్పించుకోలేం.

కనీసం వారంలో ఓ రెండు రోజులైనా, సెలవుల్లో ఓ వారమైన వీటన్నిటికి దూరంగా… ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో, కాలుష్యం లేని పచ్చని ప్రదేశాల్లో గడపాలని అందరికీ ఉంటుంది. ఫుల్ గా రీఛార్జ్ కావాలనీ ఉంటుంది.

అయితే, అలాంటి చోట మనదంటూ ఒక సొంత ఇల్లు ఉంటే… ఇంకా చెప్పాల్సింది ఏముంది, అంతకంటే ఇంకేం కావాలి?

ఇలా ఆలోచించేవారు ఇప్పుడు నగరంలో పెరుగుతున్నారు. బిజీబిజీ జీవితం నుంచి వారానికి ఓ రెండు రోజులైనా ఎస్కేప్ కొట్టాలని కోరుకుంటున్నవారు ఎక్కువయ్యారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇలాంటి వెంచర్లు మొదలయ్యాయి. పచ్చని ప్రకృతి సహజ అందాలను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా… వాగులు, వంకలు, పచ్చిక మైదానాలు… వాటి మధ్యే సొంత ఇళ్లను నిర్మించే ట్రెండ్ ఆరంభ‌మైంది. హైదరాబాద్ కి ఓ రెండు గంటల్లోపు చేరుకునేంత దూరంలోనే ఇలాంటి ప్రాజెక్టులు వ‌స్తున్నాయి.

కొన్ని సంస్థ‌లు యాభై ఎక‌రాల్లోపు ఆరంభిస్తే.. మ‌రికొన్ని వంద ఎక‌రాల్లోపు ప్రారంభించాయి. మ‌రికొన్ని రియ‌ల్ కంపెనీలు వంద నుంచి రెండు వంద‌ల ఎక‌రాల్లోపు నేచ‌ర్ హోమ్స్‌కు శ్రీకారం చుట్టాయి. జ‌న‌ప్రియ ఇంజినీర్స్‌, గిరిధారి క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ వంటివి ఇందుకోసం మినీ ఊటీ అయిన వికారాబాద్‌ను ఎంచుకున్నాయి. ఇదే జాబితాలోనూ చేరిన మ‌రో సంస్థ‌.. సుమారు నూట యాభై ఎక‌రాల్లో నేచ‌ర్ హోమ్స్ కు శ్రీకారం చుట్టింది.

150 ఎక‌రాల్లో..

ఫామ్ హౌజ్‌.. వీకెండ్ విల్లాస్‌.. వీకెండ్ హోమ్స్‌.. ఇలా ర‌క‌ర‌కాల పేర్లను మ‌నం ఇదివ‌ర‌కే విన్నాం. తాజాగా ఓ సంస్థ నేచ‌ర్ హోమ్స్ ను వికారాబాద్‌లో ఆరంభించేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తోంది. ఇప్ప‌టికే అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుట్టింది. ప్ర‌కృతికి ఏమాత్రం న‌ష్టం వాటిల్ల‌కుండా.. అదే ప్ర‌కృతిలో ఓల‌లాడే విధంగా.. అక్క‌డ ల‌భించే స‌హ‌జసిద్ధ‌మైన సామ‌గ్రితోనే.. విశాల‌మైన విస్తీర్ణంలో ఇళ్ల‌ను క‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

150 ఎక‌రాల స్థ‌లాన్ని మ‌హా అయితే యాభై నుంచి వంద మందికి మాత్ర‌మే విక్ర‌యించాల‌ని చూస్తోంది. ఇందులో కొన్న‌వారికి పూర్తి స్థాయిలో అక్క‌ర‌కొచ్చే విధంగా.. ప‌ది ఎక‌రాల్లో రిసార్డును డెవ‌ల‌ప్ చేస్తున్నారు. మొత్తానికి, ఈ తరహా ప్రాజెక్టుల్లో స్థలాన్ని ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా, గచ్చిబౌలి నుంచి సులువుగా రాకపోకల్ని సాగించేందుకు వీలుండే వికారాబాద్ ఏరియాను ఎంచుకునే వారి సంఖ్య అధికమవుతోంది.

This website uses cookies.